సతీశ్(ఫైల్)
ధర్మపురి: ఆడుతూ.. పాడుతూ ఆనందంగా ఉన్న కొడుకు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించి లక్షలు వెచ్చించినా ప్రాణం దక్కలేదు. నాడు భర్త.. నేడు కొడుకు మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన దూడ శంకరమ్మ భర్త 2012లో అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూలీపని చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లు, కొడుకు సతీశ్(20)ను పోషిస్తోంది.
డిగ్రీ చదువుతూనే జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో ఎంఎల్‌టీగా పనిచేస్తున్న సతీశ్ ఈనెల 1న జ్వరంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీ, లివర్ చెడిపోయాయని తెలిపారు. కొడుకును బతికించుకోవడం కోసం శంకరమ్మ రూ.3లక్షల వరకు అప్పుచేసింది. ఐదు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన సతీశ్ శుక్రవారం ఆస్పత్రిలో చనిపోయాడు. ‘తండ్రి లేని తమకు అండగా ఉంటాడని అనుకుంటే నువ్వూ అక్కడికే వెళ్లావా’ అంటూ కుటుంబసభ్యులు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. శనివారం సతీశ్ అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు.
ఇవి చదవండి: పెళ్లి రోజే.. సొంత ముఠా చేతిలో గ్యాంగ్‌స్టర్ హతం..
Comments
Please login to add a commentAdd a comment