అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన మరవక ముందే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో శుక్రవారం కత్తి పోట్లు కలకలం సృష్టించాయి. మెల్‌బోర్న్ సెంట్రల్ డిస్ట్రిక్‌లో అకస్మాత్తుగా ఓ కారు మంటల్లో చిక్కుకొనగా.. అక్కడికి వచ్చిన పోలీసులు అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ వ్యక్తి కత్తితో అక్కడున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారి తన గన్‌కు పనిచెప్పాడు. గాయపడ్డ నిందితుడిని ఆసుపత్రికి తరలించామని విక్టోరియా పోలీసులు మీడియాకు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియలేదన్నారు.ఇక నిందితుడి కత్తిపోట్లతో ముగ్గురు గాయపడ్డారు. ఒకరికి మెడభాగంలో గాయమైందని, అతని పరిస్థితి సీరియస్‌గా ఉందని, రెండో వ్యక్తికి తల భాగంలో గాయమైందని, అతని ఆరోగ్య పరిస్థితి, మూడో వ్యక్తి గాయం గురించి సమాచారం లేదని స్థానిక మీడియా పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో నిందితుడు పోలీసులపై కత్తితో దాడి చేస్తుండగా.. వారు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికి అతను వినకపోవడంతో ఓ పోలీస్ అధికారి తుపాకీతో కాల్చేసినట్లు స్పష్టం అవుతోంది.
మెల్‌బోర్న్‌లో కత్తి పోట్లు కలకలం
Published Fri, Nov 9 2018 1:00 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement