గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా : గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారాయణరెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రంగడు శుక్రవారం కత్తితో గాయపర్చాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.