Old faction
-
చంపేస్తాడని.. చంపేశాడు
మీర్‌పేట: పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం బావమరిదిని హత్య చేసిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనానికి చెందిన షభానాబేగం కుమారుడు సల్మాన్ (25) పలు కేసుల్లో నిందితుడు. దీంతో పోలీసులు అతనిపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇదే ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు దాసరి సురేందర్ (32).. సల్మాన్ చెల్లి ఫాతిమాబేగంను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమెను భవనం పైనుంచి తోసి చంపేశాడు. దీంతో సురేందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో సల్మాన్, సురేందర్ మధ్య వైరం పెరిగింది. ఇద్దరూ జైలులో ఉండగా సైతం తరచూ గొడవ పడేవారు. రెండు నెలల క్రితం (పది రోజుల తేడాలో) ఇద్దరూ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా సల్మాన్ పెద్దనాన్న కూతురు స్వర్ణలతతో సురేందర్ సన్నిహితంగా ఉంటున్నాడు. అప్పటికే తన చెల్లిని చంపాడని రగిలిపోతున్న సల్మాన్ బతికిఉంటే తనకు ప్రమాదమని భావించిన సురేందర్ బావమరిదిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత స్వర్ణలత ద్వారా సల్మాన్‌కు ఫోన్ చేయించి టీకేఆర్ కమాన్ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి రప్పించాడు. వచ్చీరాగానే సురేందర్ అతనిపై కత్తితో విరుచుకుపడ్డాడు. గొంతుతో పాటు శరీరంపై దాడి చేయడంతో సల్మాన్ అక్కడికక్కడే కూలిపోయాడు. విషయం తెలుసుకున్న సల్మాన్ తమ్ముడు అర్బాజ్ వెంటనే అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి షభానాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేందర్‌తో పాటు అతని అనుచరులు పరారీలో ఉన్నట్లు సీఐ వివరించారు. సల్మాన్ తల్లి ముస్లిం కాగా తండ్రి హిందువు అని పోలీసులు తెలిపారు. -
పాత కక్షలతో మహిళ హత్య
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్): మండలంలోని ఇప్పల నవగాంలో శుక్రవారం అర్ధరాత్రి పాత కక్షలతో వివాహిత ఇంజరి లక్ష్మి హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఇంజరి బాపు, బద్ది రామయ్య గ్రామానికి చెందిన పటేల్ సోమయ్య వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఈ డబ్బుల్లో చెరో రూ.5 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకున్న మరుసటి రోజు నుంచి రామయ్య పనులకు వెళ్లడం లేదు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడం లేదు. ఈ క్రమంలో తీసుకున్న డబ్బులు రామయ్య వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకుని చెల్లించలేదు, పనికి వెళ్లలేదు. దీంతో శుక్రవారం రాత్రి బాపు తన భార్య లక్ష్మితో కలిసి రామయ్య ఇంటికి వెళ్లాడు. విషయం మాట్లాడుతుండగా అక్కడే ఉన్న రామయ్య మేనల్లుడు ఆత్రం మహేశ్.. బాపు భార్య లక్ష్మి పొత్తి కడుపుపై పిడిగుద్దులు గుద్దుతూ, మెడ, తలపై దాడి చేశాడు. గొంతు నులిమి దాడి చేశాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లయ్య తెలిపారు. -
వెంటాడి గొంతుకోసి చంపిన బంధువులు
గూడూరు: పాత కక్షలు పురివిప్పాయి... అదను కోసం కాపుకాసిన బంధువులు మారణాయుధాలతో వెంటాడి.. అతి కిరాతకంగా చిన్న జయరామయ్య(30), డేగా పెద్ద జయరామయ్య (32) అనే ఇద్దరిని గొంతుకోసి, నరికి చంపిన దారుణ ఘటన గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం జరిగింది. ఈ జంట హత్యలతో ఆ ప్రాంతం భీతిల్లింది. వివరాల మేరకు.. పందులు మేపుకుంటూ జీవనం సాగించే దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులైన డేగా రామయ్య, డేగా చెంగయ్య కుటుంబాలకు పాత కక్షలు ఉండేవి. ఈ ఏడాది జూలై 5న డేగా చెంగయ్య కుమారుడు నారాయణ పందులను మేతకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో డేగా రామయ్యతో కలిసి అతని తమ్ముడు చిన కోటయ్య, కొడుకులు చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్య, బాబు, కాపుకాసి నారాయణను హతమార్చారు. దీంతో పోలీసులు చిన్న, పెద్ద జయరామయ్యలు, బాబు, తండ్రి రామయ్య, చిన్నాన్న చిన్న కోటయ్యలైన ఐదుగురిపై హత్య కేసు నమోదు చేయడంతోపాటు, రౌడీ షీట్లు కూడా తెరిచారు. ఆ రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఘర్షణలు పునరావృతమై హత్యలకు దారితీయకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని ఊరు విడిచి వెళ్లిపోవాలని చెప్పడంతో, వారు కోట మండలం విద్యానగర్‌కు కాపురం వెళ్లాపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం రామయ్య ఇల్లు కాలిపోవడంతో, చిన్న, పెద జయరామయ్యలు, సోదరుడు బాబు, వారి భార్యాపిల్లలు గూడూరుకు వచ్చారు. అదును చూసి హత్యచేశారు.. ఇదే అదును కోసం కాపుకాసి ఉన్న డేగా చెంగయ్య బంధవులు రమేష్, శీను, చింతాలు, కాంతారావుతో ఇంకొందరు మహిళలు.. ఇంటి పనులు చేసుకుంటున్న చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్యలతోపాటు, వారి కుటుంబ సభ్యులపై కారప్పొడి చల్లి దాడికి పాల్పడ్డారు. సోదరులు చిన్న పెద్ద జయరామయ్యలను విచక్షణా రహితంగా గొంతు కోసి, ముఖంపై కత్తులతో పోట్లు పొడిచి గుర్తుపట్టలేనంతగా హత్యచేశారు. ఈ దాడిలో సోదరులిద్దరూ మృతి చెందగా, పెద్ద జయరామయ్య భార్య చినక్క, అత్త పూజారి రామమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సోదరులతోపాటు వచ్చిన బాబు అప్పుడే వెళ్లిపోవడంతో తప్పించుకున్నాడు. లేదంటే అతన్ని కూడా మట్టుపెట్టేవారని బంధువులు విలపించారు. పోలీసుల అదుపులో కొందరు నిందితులు ఈ మేరకు సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, పట్టణ సీఐ టీవీ సుబ్బారావులతోపాటు ఎస్సై బాబి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగినట్లు తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృత దేహాల వద్ద బోరున విలపించారు. తమ వారిని హత్య చేసిన వారిని కూడా చంపేస్తామంటూ బయలుదేరబోగా డీఎస్పీ వారిని వారించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుని భార్య చిన్నక్క నుంచి వివరాలు సేకరించారు. దారుణ హత్యలకు పాల్పడ్డ వారిలో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
ప్రకాశం జిల్లా : గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారాయణరెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రంగడు శుక్రవారం కత్తితో గాయపర్చాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు లాయర్ల హత్య
- కక్షిదారుడే కాల్చి చంపాడు - పాత కక్షలతో మరో లాయర్ హతం - రెండు హత్యలకు మద్యం మత్తే ప్రధాన కారణం చెన్నై, సాక్షి ప్రతినిధి : సరదాగా తీసుకున్న మద్యం ఇద్దరు లాయర్ల ప్రాణాలను హరించివేసింది. అసలు కారణం ఏదైనా మద్యం మత్తులో ఆవేశానికి లోనుకావడం నిండు ప్రాణాలను నిలువునా తీసింది. చంటిబిడ్డతో ఉన్న ఓ ఇల్లాలికి, నిండు గర్భిణిగా ఉన్న మరో ఇల్లాలికి భర్తల మరణం తీరనిశోకాన్ని మిగిల్చింది. చెన్నై అడయార్ వన్నాందురై ఎల్లయమ్మాళ్ కోవిల్ వీధికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు కామేష్ (34) సైదాపేట కోర్టులో లాయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండయార్‌పేటకు చెందిన ఈశ్వరన్ (25)పై ఉన్న మూడు హత్య కేసులను కామేష్ వాదిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈశ్వరన్ తన కారులో లాయర్ కామేష్‌ను పుదుచ్చేరికి తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి 7 గంటల వరకు ఇద్దరూ మద్యం సేవించి అర్ధరాత్రి చెన్నైకి బయలుదేరారు. కారును కామేష్ నడుపుతున్నాడు. ఈ సమయంలో ఈశ్వరన్ తన వద్దనున్న తుపాకీతో కామేష్‌ను కాల్చి పరారైనట్లు సమాచారం. కామేష్ తీవ్రరక్తస్రావంతో బాధపడుతూనే తండయార్‌పేటకు చెందిన సెల్వం అనే తన స్నేహితునికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మరికొందరు స్నేహితులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సెల్వం అడయార్‌లోని ఒక ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే చికిత్స ఫలించక కామేష్ ప్రాణాలు వదిలాడు. భిన్న కథనాలు హత్యకు దారితీసిన వివరాల్లో భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. తనపై సాగుతున్న కేసుల విచారణకు కామేష్ మరింత సొమ్ము కోరడం, కేసును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడాన్ని సహించలేకనే చంపివేసినట్లు నిందితుడు ఈశ్వరన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న కామేష్ మార్గమధ్యంలో డివైడర్‌కు గీసుకున్నట్లు వాహనాన్ని పోనించడంతో సదరు కారు యజమాని కూడా అయిన ఈశ్వరన్ కోప్పడి హేళనగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్రంగా ఘర్షణపడటం, ఈశ్వరన్ తన వద్దనున్న తుపాకీతో కామేష్‌ను కాల్చడం జరిగినట్లు మరో కథనంగా ఉంది. లాయర్ కామేష్ తన రక్షణార్థం తుపాకీ వెంటపెట్టుకు తిరుగుతాడని, పుదుచ్చేరి వెళ్లినపుడు ప్యాంటుకు వెనుకవైపు వీపులో తుపాకీని పెట్టుకుని కారును నడుపుతుండగా ప్రమాద వశాత్తు పేలినట్లు మూడో కథనం వినిపిస్తోంది. నిందితుడు ఈశ్వరన్‌ను అరెస్ట్ చేసి, లాయర్ ప్రాణాలు పోవడానికి కారణమైన తుపాకీని, ఈశ్వరన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కామేష్‌కు దీపా అనే భార్య, మేఘ అనే నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. లాయర్ ప్రాణం తీసిన మద్యం గొడవ బారులో మద్యం సేవనంలో జరిగిన గొడవ జమాల్ అహ్మద్ అనే లాయర్ ప్రాణాలను బలితీసుకుంది. దిండుగల్లు జిల్లా చెంబట్టికి చెందిన జమాల్ అహ్మమద్ (32), భార్య కభీషా (22) ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. జమాల్ అహ్మమద్ దిండుగల్లు కోర్టులో న్యాయవాది వృత్తిని నిర్వహిస్తున్నారు. గతంలో ఒక ముస్లిం సంఘం నేతగా ఉండి ప్రస్తుతం విడుదలై చిరుతైగళ్ కట్చిలో ఉన్నాడు. ఇతనిపై దాడులు, ఆస్తి పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు అనేక పోలీస్ కేసులు ఉన్నాయి. జమాల్‌కు సిద్దయన్ కోట్టైకి చెందిన సెల్వకు మధ్య పాతకక్షలున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జమాల్ అహ్మద్ మద్యం సేవిస్తుండగా, ముగ్గురు స్నేహితులతో కలిసి సెల్వ అదే బారుకు మద్యం తాగేందుకు వచ్చాడు. ఇద్దరికీ మద్యం మత్తు బాగా ఎక్కడంతో గొడవపడ్డారు. రెండు వర్గాలను బార్ యజమాని బైటకు తరిమివేశాడు. బార్ బయట ఒంటరిగా నిల్చుని ఉన్న జమాల్ అహ్మద్‌పై సెల్వ తన ముగ్గురు స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. వారు కొట్టిన దెబ్బలకు జమాల్ స్పృహకోల్పోయి పడిపోవడంతో నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన జమాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ దాడి
వేటకొడవళ్లు, గొడ్డళ్లతో వెంటాడిన వైనం పొన్నూరు: పాతకక్షల నేపథ్యంలో చర్చలకు పిలిచి నిరాయుధులైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై పాతకక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ సంఘటనలో వైఎస్సాఆర్సీపీ సానుభూతిపరులు ఐదుగురికి తలలు పగలగా, మరికొందరికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, వైఎస్సాఆర్సీపీ సానుభూతిపరుల మధ్య గత కొంత కాలంగా చిన్నచిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, ఈ మేరకు చర్చలకు రావాలని తెదేపా వర్గీయులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను ఆహ్వానించారు. తక్కువ కుటుంబాలు ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆదివారం చర్చలకు వెళ్లారు. చర్చలు ప్రారంభం కాకముందే టీడీపీకి చెందిన కూరపాటి శ్యామ్ తాను గతంలోనే హత్యలు చేశానని, పోలీసులు, జైళ్లు కొత్తేమీ కాదనీ, ఒక్కొక్కరిని లేపేస్తానంటూ రెచ్చగొట్టడంతో పాటు దాడికి దిగాడు. వ్యూహత్మకంగా జరిగిన ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు కూరపాటి పిచ్చయ్య, కూరపాటి సురేష్, కూరపాటి చిన్నబాబు, కూరపాటి నాగశేషు, కూరపాటి జయరాజు, కూరపాటి అశోక్‌రాజు, శ్రీరాం సుశీలరావు వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్నవ నాగార్జునను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నవ నరసింహారావు, మన్నవ ఆదాం, దగ్గుమల్లి సుబ్బారావు, కనపర్తి సుబ్బారావుల తలలు పగిలాయి. దగ్గుమల్లి స్టాలిన్, జయదేవ్, సొంగా రాజు, ఉర్రా సుబ్బయ్య తదితరులకు స్వల్ప గాయాలైయ్యాయి. వీరందరూ నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యానగర్: టీడీపీ నాయకుల దాడిలో ఆదివారం తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ సానుభూతిపరునికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన మన్నవ నాగార్జున ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుని జీవిస్తుంటాడు. తెదేపా కార్యకర్తలు శ్యామ్, మరో నలుగురు తనపై ఇనుపరాడ్డులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు చెప్పాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు బాధితుడిని పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందనీ, అత్యావసర చికిత్సా విభాగంలో చికిత్సనందిస్తున్నామని అన్నారు. 24 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత స్టేషన్‌కు తరలించనున్నామని ఔట్ పోష్టు సిబ్బంది తెలిపారు. -
పడగవిప్పిన పాతకక్షలు
- మహిళను నరికి చంపిన యువకుడు - అడ్డుకోబోయిన భర్తకు తీవ్రగాయాలు సుల్తాన్‌బజార్: పాత కక్షలు మహిళ ఉసురు తీశాయి. ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో భార్య మృతి చెందగా...అడ్డుకున్న భర్తకూ తీవ్రగాయాలయ్యాయి. సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సుల్తాన్‌బజార్ ఇన్ స్పెక్టర్ శివశంకర్, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం.... కోఠి పుత్లిబౌలీ రంగ్‌మహాల్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణంలో ఆనంద్‌దాస్, సోనిబాయి(34) దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి ఉంటున్నారు. ఆనంద్‌దాస్ అదే గుడిలో పూజారి. ఇదిలా ఉండగా... గతంలో తన పెదనాన్న తులసీరామ్ యాదవ్‌ను సోనిబాయి హత్య చేసిందని మారేడుపల్లి వాల్మీకినగర్‌కు చెందిన లకన్యాదవ్(24) ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 7 గంటలకు లకన్ కత్తి వెంటబెట్టుకొని సోనిబాయిని హత్య చేసేందుకు రంగ్‌మహాల్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ ఆలయానికి చేరుకున్నాడు. వాకిలి ఊడుస్తున్న సోనిబాయి మెడపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆమె అరుస్తూ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పట్టుకొని మారీ చాతి, చేతులు, మెడ, కడుపు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. బాత్రూంలో స్నానం చేస్తున్న భర్త ఆనంద్‌దాస్ భార్య అరుపులు విని బయటకు వచ్చి లకన్‌ను అడ్డుకోబోగా.. అతడిపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తల్లిదండ్రుల అరుపులు విని పక్కరూంలో నిద్రిస్తున్న వారి కుమారుడు కూల్దీప్, పక్కనే అద్దెకుండే ఆటో డ్రైవర్ సాయి పరుగెత్తుకు రావడంతో లకన్ కత్తితో అక్కడి నుంచి పరుగుతీశాడు. సాయి అతడిని వెంబడిస్తుండగా చూసిన పోలీసులు లకన్‌ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. సోనిబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు, తీవ్రంగా గాయపడ్డ ఆనంద్దాస్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్సపొందుతున్నాడు. సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్ఐ బాల్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్తి వివాదంలో గతంలో హత్య.. ఆస్తి వివాదం కారణంగా 2009లో లకన్యాదవ్ బాబాయి తుల్జారామ్ను అతని సోదరుడు కిషన్‌తో కలిసి దూరపుబంధువు (వరుసకు అత్త) అయిన సోనిబాయి హత్య చేసింది. మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి జడ్చర్ల ప్రాంతంలో పడేశారు. ఈ కేసులో సోనిబాయి, కిషన్ ప్రధాన నిందితులు. కిషన్ పరారీలో ఉండటంతో ఈ కేసు చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్లో పెండింగ్‌లో ఉంది. తన బాబాయిని హత్య చేసిన సోని బాయిని చంపాలని లకన్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. కన్నీరు మున్నీరైన కుమారులు.. తన కళ్లముందే తల్లిని విచక్షణారహితంగా పొడిచి చంపుతున్న దృశ్యాన్ని చూసిన కుమారుడు కుల్దీప్ షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకొని ఇసామియాబజార్‌లో ఉండే బంధువులకు సమాచారం అందించడంతో పాటు హాస్టల్లో ఉన్న తమ్ముళ్లను తీసుకొచ్చాడు. మృతదేహాన్ని చూసి సోనిబాయి కుమారులు రోదించిన తీరు అక్కడివారి హృదయాలను కలిచివేసింది. దర్జాగా తిరుగుతున్నారనే: లకన్ తుల్జారామ్ బాబాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆస్తి విషయంలో అత్త సోనిబాయి, బాబాయి కిషన్ కలిసి దారుణంగా చంపేసి దర్జాగా బయట తిరుగుతున్నారు. అందుకే సోనిబాయిని చంపేశా. ఆమె భర్త ఆనంద్‌దాస్,అతని కొడుకు కుల్దీప్పై నాకు ఎలాంటి పగలేదు. ఆనంద్‌దాస్ అడ్డం రావాడంతో అతడికి గాయాలయ్యాయి. -
వేటాడి... వెంటాడి హత్య
గాజువాక : తుక్కు వ్యాపారుల మధ్య పాతకక్షలు మరోసారి పేట్రేగాయి. మాటేసి పథకం ప్రకారం చేసిన దాడిలో ప్రత్యర్థి మృత్యువాత పడ్డాడు. చినగంట్యాడ జాతీయ రహదారిపై అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై చోటు చేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసుల కథనం ప్రకారం చినగంట్యాడలో తుక్కు వ్యాపారం నిర్వహిస్తున్న పైలా ప్రకాష్ వద్ద కుంచుమాంబ కాలనీకి చెందిన కొణతాల నూకరాజు (27) పని చేసేవాడు. ఒక మహిళ కోసం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నూకరాజు అక్కడ పని మానేసి గంగవరం పోర్టు రోడ్డులో తుక్కు దుకాణం నిర్వహిస్తున్న సాహు రాము వద్ద చేరాడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవలు ఆగలేదు. ఆరు నెలల క్రితం కూడా ప్రకాష్ బృందం సాహు రాము తుక్కు దుకాణంపై దాడికి దిగింది. అప్పటి నుంచి అంతమొందిస్తానంటూ నూకరాజును ప్రకాష్ బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్ తన అనుచరులను పురమాయించడంతో వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పథకం ప్రకారం వారు నూకరాజుతో మంచిగా వ్యవహరిస్తూ ఆరునెలలపాటు కాలం గడిపేశారు. బుధవారం పార్టీ ఇస్తామని నూకరాజును చినగంట్యాడలోని సరిగమ బార్‌కు పిలిచారు. మద్యం సేవించాక మెల్లగా గొడవ ప్రారంభించి ఒక్కసారిగా పెద్దది చేశారు. అరుపులు, కేకలతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రకాష్ బృందానికి చెందిన ఆరుగురు వ్యక్తులు నూకరాజుపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశారు. పొట్ట భాగంలో కత్తితో పొడవగానే బాధితుడు తప్పించుకొనే ప్రయత్నం చేసి రోడ్డుపైకి పరుగులు తీశాడు. అతడి వెంటే రోడ్డుపైకి వచ్చిన ప్రత్యర్థులు జాతీయ రహదారిపైగల ఒక ఫంక్షన్ హాల్‌కు సమీపంలో నూకరాజును పట్టుకొని అతని తల, తొడ, పొట్ట, ఇతర శరీర భాగాల్లో సుమారు పది పోట్లు పొడిచారు. ఈ సంఘటనతో నూకరాజు కుప్ప కూలిపోవడంతో వారు వెనుదిరిగారు. నిందితులను పట్టుకున్న రూరల్ ఎస్పీ సిబ్బంది ఆ సమయంలోనే గాజువాక నుంచి అనకాపల్లి వెళ్తున్న రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఈ దృశ్యాన్ని చూశారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించడంతో వారు వెంబడించారు. నిందితుల్లో చొక్కాకుల శివాజీ అలియాస్ శివ (19), కొడాలి భరత్ అలియాస్ నానాజీ (20)లను పట్టుకొని గాజువాక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మిగిలిన నిందితులు పరారయ్యారు. కుప్పకూలిన నూకరాజును తొలుత అక్కడికి సమీపంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించగా అక్కడ మృతి చెందినట్టు ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పైలా ప్రకాష్ పరారవడంతో రెండు బృందాలను నియమించినట్టు సీఐ ఎం.అప్పారావు తెలిపారు. -
కిరాతకం
పాత కక్షలతో వృద్ధుడి దారుణ హత్య తల, కాళ్లు, చేతులు వేరుచేసిన వైనం అత్యంత భయానకంగా ఘటనాస్థలి నిందితుడి స్వస్థలం గుంటూరు జిల్లా గతంలో మరో దారుణ హత్య కేసులోనూ నిందితుడు పాత కక్షలు పురివిప్పాయి. తన మేనమామ హత్యకేసులో ప్రధాన నిందితుడిపై కక్షగట్టిన యువకుడు అదును చూసుకుని అతన్ని దారుణంగా నరికి చంపాడు. శరీర భాగాలు వేరువేసి పాశవికంగా హత్యచేశాడు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీకాకుళం (ఘంటసాల) : జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతోంది. గతనెల నుంచి జిల్లాలో వివిధ ఘటనల్లో వేర్వేరు కారణాలతో కొందరు దారుణహత్యకు గురైన విష యం తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం గ్రా మంలో పాత కక్షల నేపథ్యంలో ఆదివారం ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు తెలిపిస సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధిం చి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సూర్యచంద్రరావు(65) వ్యవసాయదారుడు. 1998లో గ్రామంలోని మ ద్యం దుకాణం వద్ద లింగినేని సాంబశివరావు అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో సూర్యచంద్రరావు ప్రధాన నిం దితుడు. రెండేళ్ల క్రితం కోర్టులో ఈ కేసును కొట్టివేశారు. సాంబశివరావు మేనల్లుడి కుమారుడైన సోమరౌతు వెంకట నాగేశ్వరరావు(రాజా) గుంటూ రు జిల్లా లింగినేనిపాలెంలో నివాసం ఉండేవాడు. డిగ్రీ చదువుతూ మధ్యలో మానివేశా డు. రెండేళ్ల కిందట ఇతడు శ్రీకాకుళానికి చెంది న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడు. భార్యతో గొడవల కారణంగా ఏడు నెలల కిందట ఆమె నుంచి విడిపోయాడు. అప్పటినుంచి ఇక్కడే వే రుగా ఉంటున్నాడు. సాంబశివరావు హత్య వివరాలను తెలుసుకున్న రాజా.. కొంతకాలంగా సూర్యచంద్రరావుపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని కరకట్ట కింద ఉన్న వంగతోటకు నీరు పెట్టేందుకు సూ ర్యచంద్రరావు వెళ్లాడు. మోటార్ ఆన్ చేసిన అనంతరం పక్కనే ఉన్న వెదురు చెట్ల కింద ఆదమరచి నిద్రించాడు. ఇదే అదనుగా భా వించిన రాజా వెంట తెచ్చుకున్న కత్తితో సూ ర్యచంద్రరావును అత్యంత క్రూరంగా నరికి చంపాడు. తల, కాళ్లు, చేతులను వేరు చేసి చిందరవందరగా పడవేశాడు. అత డి పొట్టపై నరికి పేగులు బయటకు తీశాడు. భీతావహంగా ఉన్న ఈ దృశ్యం చూపరులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వినాయకుడికి నమస్కారం పెట్టి పరార్ సూర్యచంద్రరావును హత్య చేసిన అనంతరం రాజా అక్కడి నుంచి రక్తం మరకలు అంటిన దుస్తులతోనే కరకట్ట వరకు వచ్చాడు. కరకట్టపై రావిచెట్టు కింద ఉన్న వినాయకుని గుడికి వెళ్లి దండం పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న కొంతమందితో ‘సూర్యచంద్రరావును ముక్కలు ము క్కలుగా నరికేశాను, వెళ్లి చూసుకోండి’ అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. 27ఏళ్ల వ యస్సు గల రాజా గుంటూరు జిల్లా లింగినేనిపాలెం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఈ ఘటనలో అతడు ఓ వ్యక్తిని హత్య చేసి శరీ రం నుంచి తలను వేరు చేశాడు. దానిని తీసుకువెళ్లి గ్రామ రచ్చబండ వద్ద ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన అప్పట్లో ఆ గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. హత్యకు గురైన సూర్యచంద్రరావుకు భార్య, ముగ్గురు కుమారు లు ఉన్నారు. ఈయన గుంటూరు జిల్లా స త్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుత్తుంబాక భారతికి త మ్ముడు. మృతుడి పెద్ద కుమారుడు శేషగిరి విజయవాడలోని ఓ పత్రికా కార్యాలయంలో ఉ ద్యోగి. రెండో కుమారుడు సురేష్ కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చి న్న కుమారుడు కిరణ్ హైకోర్టులో న్యాయవాది. ఘటనాస్థలిని పరిశీలించిన డీఎస్పీ ఈ హత్య గురించి సమాచారం అందుకున్న అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు, చల్లపల్లి సీఐ దుర్గారావు, ఘంటసాల, కూచిపూడి ఎస్సైలు వెంకటేశ్వరరావు, సురేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలిలో రెండు కత్తులు ఉన్న ట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఓ కత్తి సగం వి రిగిపోయి ఉంది. మరొకటి మామూలుగానే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. -
పడగవిప్పిన పాతకక్షలు
ఐదుగురికి తీవ్ర గాయూలు, ఆస్పత్రికి తరలింపు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు, రెవెన్యూ అధికారులు విఫలం భూతగాదాలే ఘర్షణకు ప్రధాన కారణం రావుకుప్పం, న్యూస్‌లైన్: బందార్లపల్లె పంచాయుతీ పావునబోయునపల్లె గ్రావుంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు ఒక్కసారిగా భగ్గువున్నాయి. గురువారం రెండు వర్గాలవారు రావుకుప్పం పట్టణ నడిబొడ్డున పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూ రంలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. తీవ్ర రక్తగాయూలతో తలలు బద్దలయ్యేలా కొట్టుకున్నారు. ఈ ఘటన వుండలంలో సంచ లనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పావునబోయునపల్లె గ్రావూనికి చెందిన జనార్ధన్‌రెడ్డి, కుందనందారెడ్డిలతో పాటు కాశిరెడ్డి, ఆనందప్పల వుధ్య మూడేళ్లుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయుంపై రెండు వర్గాల వారు పలువూర్లు ఘర్షణలు పడి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. అలాగే భూమూలు తవువంటే తవువే అంటూ ఇరువర్గాల వారు కోర్టులకెక్కారు. ప్రస్తుతం ఈ భూ సవుస్యలపై కోర్టులో విచారణ సాగుతోంది. బుధవారం సాయుంత్రం జనార్ధన్‌రెడ్డి సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి(30) ప్రత్యర్థులతో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో వే ణుగోపాల్‌రెడ్డి గాయుపడి ఆస్పత్రి పాలయ్యూడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను శాంతింపజేశారు. మూందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి గ్రావుంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయుం పోలీసులు గ్రావుం విడిచి వెళ్లిపోయూరు. ఎప్పటిలాగే రెండు వర్గాలవారు పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు రావుకుప్పం పట్టణానికి వచ్చారు. విజలాపురం క్రాస్ వద్ద ఒకరికొకరు ఎదురుపడ్డారు. వూటావూట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగారు. అంతలోనే కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో జనార్ధన్‌రెడ్డి(42), మూనిరెడ్డి(45), కుందనందారెడ్డి(48), కాశిరెడ్డి(30), ఆనందప్ప(45) తీవ్రంగా గాయుపడ్డారు. సవూచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయుపడినవారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు కుప్పం తీసుకెళ్లారు. సవుస్యలను పరిష్కరించడంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కాలయూపన చేయుడంతోనే రక్తపాతం సంభవించిందని పలువురు వుండిపడుతున్నారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటావుని స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియుక గ్రావుస్తులు బిక్కుబిక్కువుని కాలం గడుపుతున్నారు. గ్రావుంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయూలని పలువురు కోరుతున్నారు.