కిరాతకం | The assassination of the old faction of older people | Sakshi
Sakshi News home page

కిరాతకం

Published Mon, Jun 23 2014 1:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

కిరాతకం - Sakshi

కిరాతకం

  • పాత కక్షలతో వృద్ధుడి దారుణ హత్య
  •  తల, కాళ్లు, చేతులు వేరుచేసిన వైనం
  •  అత్యంత భయానకంగా ఘటనాస్థలి
  •  నిందితుడి స్వస్థలం గుంటూరు జిల్లా
  •  గతంలో మరో దారుణ హత్య కేసులోనూ నిందితుడు
  • పాత కక్షలు పురివిప్పాయి. తన మేనమామ హత్యకేసులో ప్రధాన నిందితుడిపై కక్షగట్టిన యువకుడు అదును చూసుకుని అతన్ని దారుణంగా నరికి చంపాడు. శరీర భాగాలు వేరువేసి పాశవికంగా హత్యచేశాడు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
     
    శ్రీకాకుళం (ఘంటసాల) : జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతోంది. గతనెల నుంచి జిల్లాలో వివిధ ఘటనల్లో వేర్వేరు కారణాలతో కొందరు దారుణహత్యకు గురైన విష యం తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం గ్రా మంలో పాత కక్షల నేపథ్యంలో ఆదివారం ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు తెలిపిస సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధిం చి వివరాలిలా ఉన్నాయి.

    శ్రీకాకుళం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సూర్యచంద్రరావు(65) వ్యవసాయదారుడు. 1998లో గ్రామంలోని మ ద్యం దుకాణం వద్ద   లింగినేని సాంబశివరావు అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో సూర్యచంద్రరావు ప్రధాన నిం దితుడు. రెండేళ్ల క్రితం కోర్టులో ఈ కేసును కొట్టివేశారు. సాంబశివరావు మేనల్లుడి కుమారుడైన సోమరౌతు వెంకట నాగేశ్వరరావు(రాజా) గుంటూ రు జిల్లా లింగినేనిపాలెంలో నివాసం ఉండేవాడు. డిగ్రీ చదువుతూ మధ్యలో మానివేశా డు. రెండేళ్ల కిందట ఇతడు శ్రీకాకుళానికి చెంది న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడు. భార్యతో గొడవల కారణంగా ఏడు నెలల కిందట ఆమె నుంచి విడిపోయాడు. అప్పటినుంచి ఇక్కడే వే రుగా ఉంటున్నాడు.
     
    సాంబశివరావు హత్య వివరాలను తెలుసుకున్న రాజా.. కొంతకాలంగా సూర్యచంద్రరావుపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని కరకట్ట కింద ఉన్న వంగతోటకు నీరు పెట్టేందుకు సూ ర్యచంద్రరావు వెళ్లాడు. మోటార్ ఆన్ చేసిన అనంతరం పక్కనే ఉన్న వెదురు చెట్ల కింద ఆదమరచి నిద్రించాడు. ఇదే అదనుగా భా వించిన రాజా వెంట తెచ్చుకున్న కత్తితో సూ ర్యచంద్రరావును అత్యంత క్రూరంగా నరికి చంపాడు. తల, కాళ్లు, చేతులను వేరు చేసి చిందరవందరగా పడవేశాడు. అత డి పొట్టపై నరికి పేగులు బయటకు తీశాడు. భీతావహంగా ఉన్న ఈ దృశ్యం చూపరులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.  
     
    వినాయకుడికి నమస్కారం పెట్టి పరార్

     
    సూర్యచంద్రరావును హత్య చేసిన అనంతరం రాజా అక్కడి నుంచి రక్తం మరకలు అంటిన దుస్తులతోనే కరకట్ట వరకు వచ్చాడు. కరకట్టపై రావిచెట్టు కింద ఉన్న వినాయకుని గుడికి వెళ్లి దండం పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న కొంతమందితో ‘సూర్యచంద్రరావును ముక్కలు ము క్కలుగా నరికేశాను, వెళ్లి చూసుకోండి’ అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

    27ఏళ్ల వ యస్సు గల రాజా గుంటూరు జిల్లా లింగినేనిపాలెం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఈ ఘటనలో అతడు ఓ వ్యక్తిని హత్య చేసి శరీ రం నుంచి తలను వేరు చేశాడు. దానిని తీసుకువెళ్లి గ్రామ రచ్చబండ వద్ద ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన అప్పట్లో ఆ గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. హత్యకు గురైన సూర్యచంద్రరావుకు భార్య, ముగ్గురు కుమారు లు ఉన్నారు.

    ఈయన గుంటూరు జిల్లా స త్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుత్తుంబాక భారతికి త మ్ముడు. మృతుడి పెద్ద కుమారుడు శేషగిరి విజయవాడలోని ఓ పత్రికా కార్యాలయంలో ఉ ద్యోగి. రెండో కుమారుడు సురేష్ కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చి న్న కుమారుడు కిరణ్ హైకోర్టులో న్యాయవాది.
     
    ఘటనాస్థలిని పరిశీలించిన డీఎస్పీ
     
    ఈ హత్య గురించి సమాచారం అందుకున్న అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు, చల్లపల్లి సీఐ దుర్గారావు, ఘంటసాల, కూచిపూడి ఎస్సైలు వెంకటేశ్వరరావు, సురేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలిలో రెండు కత్తులు ఉన్న ట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఓ కత్తి సగం వి రిగిపోయి ఉంది. మరొకటి మామూలుగానే  ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement