- పినకడిమి ప్రతీకార హత్యల నేపథ్యంలో..
- ఉన్నతాధికారుల చర్య
విజయవాడ సిటీ : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామవాసుల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో జరుగుతున్న హత్యలు పోలీసుల మెడకు చుట్టుకుంటున్నా యి. పోలీసుల ఉదాసీనత ఆ గ్రామంలో ప్ర త్యర్థి వర్గాల హత్యలకు దారితీసిందని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై వేటు వేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న సిటీ స్పెషల్ బ్రాంచి ఏసీపీ ఎన్.సూర్యచంద్రరావును వెయిటింగ్(విధుల నుంచి తప్పించడం) లో పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏలూ రు జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులైన గంధం పగిడి మా రయ్య, గుంజుడు మారయ్య కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఏలూరుకు కారులో గత నెల 24న తండ్రి నాగేశ్వరరావుతో కలిసి వెళుతూ ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి వద్ద జాతీయ రహదారిపై దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్.. అన్ని కోణాల్లో విచారణకు ఆదేశించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను అరెస్టు చేశారు. హతుల ప్రత్యర్థులు మరో 12మంది ఈ హత్యల వ్యవహారంలో చురుగ్గా పాల్గొన్నట్టు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. గతంలో దుర్గారావు హత్య జరిగినప్పుడు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే తాజాగా మూడు హత్యలు జరిగాయని ఉన్నతాధికారులు గుర్తించారు.
దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడు కూరపాటి నాగరాజు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. పోలీసుల కనుసన్నల్లోనే నిందితుడు సులువుగా తప్పించుకుని ముంబైలో ఉంటున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అప్పట్లో సూర్యచంద్రరావు ఏలూరులో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. రెండువర్గాలతోనూ అతడికి సత్సంబంధాలు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్టయితే అతడి కుటుంబం ప్రతీకార హత్యలకు పాల్పడే ది కాదని ఉన్నతాధికారుల అభిప్రాయం.
పోలీసుల వల్ల తగిన న్యాయం జరగదనే అభిప్రాయంతోనే కిల్లర్ గ్యాంగ్‌ను వీరు ఆశ్రయించి.. ప్రతీకార హత్యలకు పాల్పడినట్టు చెబుతున్నా రు. ఇందుకు అప్పట్లో ఏలూరులో పనిచేసిన సూర్యచంద్రరావును కూడా బాధ్యునిగా చేస్తూ వెయిటింగ్‌లోకి పంపినట్టు సమాచా రం. పెద అవుటుపల్లి ట్రిపుల్ మర్డర్ కేసుకు సంబంధించి ఏలూరు ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఇప్పటికే సస్పెండయ్యారు.