జపాన్‌లో విద్యార్థినులపై కత్తులతో దాడి | Man With Knives Attacks Schoolgirls in Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో విద్యార్థినులపై కత్తులతో దాడి

May 29 2019 8:48 AM | Updated on May 29 2019 9:01 AM

Man With Knives Attacks Schoolgirls in Japan - Sakshi

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది

జపాన్‌లోని కవాసకీ నగరంలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది.

కవాసకీ: జపాన్‌లోని కవాసకీ నగరంలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌ విద్యార్థినులే లక్ష్యంగా ఓ వ్యక్తి కత్తులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ఓ విద్యార్థిని సహా ప్రభుత్వ ఉద్యోగి మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నోబోరిటో పార్క్‌ సమీపంలో ఉన్న బస్టాప్‌లో చోటుచేసుకుంది. గాయాలైన వారిలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కారిటాస్‌ గాక్వెన్‌ అనే పాఠశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులంతా బస్‌ కోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ వ్యక్తి రెండు చేతులతో కత్తులు పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఘటనకు కారణమైన వ్యక్తి గొంతు కోసుకుని మరణించాడని పోలీసులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement