కత్తితో వెళ్లిన ఆ విద్యార్థిని సంకెళ్లు వీడాయి
వెస్ట్ బ్యాంక్: తమ దేశ పౌరులను పొడిచి చంపేందుకు ప్రణాళిక రచించిందన్న కారణంతో అరెస్టు చేసి జైళ్లో పెట్టిన పన్నేండేళ్ల పాలస్తీన బాలికను ఎట్టకేలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విడిచిపెట్టింది. దాదాపు రెండున్నర నెలలు జైలులో ఉంచి అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు తుకారెం పాయింట్ వద్ద వద్ద ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించింది. ఈ సమయంలో ఆ బాలికకు తమ పట్టణం వెస్ట్ బ్యాంక్లోకి ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్లో జైలు శిక్ష అనుభవించిన అతి పిన్న పాలస్తీనా వాసి ఈ బాలికే.
యూదుల ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ పట్టణం ప్రవేశం వద్ద పాలస్తీనాకు చెందిన దిమా అల్ వావి అనే పన్నేండేళ్ల బాలిక ఈ ఏడాది 9న తన స్కూల్ యూనిఫాం షర్ట్ చాటున ఓ కత్తిపట్టుకొని వచ్చింది. అప్పటికే ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కత్తితో, బాంబులతో, కార్లతో సరిహద్దు ప్రాంతాల వద్ద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ వాసులు ఆక్రమిత ప్రాంతానికి ఈ బాలిక కత్తితో రావడం గుర్తించిన ఆ పోలీసులు ఆ బాలికను అరెస్టు చేశారు.
అయితే, పద్నాలుగేళ్ల లోపు ఉన్న బాలికకు సుదీర్ఘకాలంపాటు జైలు శిక్ష విధించడానికి యూదుల చట్టం అంగీకరించనందున ఆ బాలికకు కేవలం నాలుగున్నర నెలలు మాత్రమే జైలు శిక్ష విధించారు. ఇటీవల బాలిక తరుపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో నాలుగు వారాల ముందే ఆ బాలికను విడుదల చేసి తిరిగి పాలస్తీనా అధికారులకు అప్పగించగా వారు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.