
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతోన్న 17 ఏళ్ల బాలుడిని ఐదుగురు తోటి విద్యార్థులు దారుణంగా పొడిచి హత్య చేశారు. క్లాస్‌మేట్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత విద్యార్థి దీపాన్షుగా గుర్తించారు. విద్యార్థి హత్యపై వివరాలు వెల్లడించారు డిప్యూటీ కమిషనర్(వాయవ్య) ఉషా రంగ్నాని.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 29న ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు విద్యార్థిని కొంత మంది విద్యార్థులు కత్తులతో పొడిచినట్లు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులతో బాధితుడు గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ పగతో దీపాన్షును బటన్ నైఫ్‌తో పొడిచి హత్య చేశారు. ఆ ఆయుధాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. లాల్ బాఘ్, ఆజాద్‌పుర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు జువైనల్‌లను ఘటన జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: 42 కార్లతో పంజాబ్ సీఎం కాన్వాయ్.. ‘వీఐపీ కల్చర్’ అంటూ విమర్శలు!
Comments
Please login to add a commentAdd a comment