
న్యూఢిల్లీ: తినేందుకు రోటీ ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. కరోల్ బాఘ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ‘రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. ఫూటుగా మద్యం తాగిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకు భోజనం పెట్టాలని అడిగాడు. 40 ఏళ్ల మున్నా అనే వ్యక్తి రోటీ ఇచ్చాడు. మరో రోటీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తన వద్ద ఉన్న కత్తిని తీసి మున్నాను పొడిచాడు.’ అని డిప్యూటీ కమిషనర్ శ్వేతా చౌహాన్ తెలిపారు.
తీవ్రంగా గాయపడిన బాధితుడు మున్నాను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల ఫెరోజ్ ఖాన్‌గా గుర్తించారు. కరోల్ బాఘ్‌లోని ఓ పార్క్‌లో నిద్రిస్తున్న ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ‘గూగుల్’లో జాబ్ కొట్టటమే లక్ష్యం.. 40వ యత్నంలో సఫలం!
Comments
Please login to add a commentAdd a comment