ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి | Eight children found dead in Australia home | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి

Published Fri, Dec 19 2014 1:48 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి - Sakshi

ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి

మెల్బోర్న్ : సిడ్నీలోని కేఫ్ ఘటన, పాకిస్థాన్ పెషావర్లో చిన్నారుల నరమేధం మనోఫలకంపై నుంచి చెరగక ముందే ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్ల్యాండ్లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఆ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది చిన్నారులను మృతదేహలను గుర్తించారు. ఆ మృతదేహలన్నీ ఏడాదిన్నర వయస్సు గల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారివి ఉన్నాయని చెప్పారు.  పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ మృతదేహాలపై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మృతులంతా సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు.  గాయపడిన మహిళ ఆరోగ్యం పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటిని అణువణువు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉల్కిపడింది. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని టోని అబ్బాట్ తెలిపారు. ఈ దారుణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement