30 సార్లు పొడిచి.. గొంతుకోసి | Gurgaon Shocking video emerges of stalker stabbing woman to death | Sakshi
Sakshi News home page

30 సార్లు పొడిచి.. గొంతుకోసి

Published Sat, Oct 29 2016 6:01 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

30 సార్లు పొడిచి.. గొంతుకోసి - Sakshi

30 సార్లు పొడిచి.. గొంతుకోసి

గుర్గావ్: మేఘాలయకు చెందిన 22 ఏళ్ల పింకి గుర్గావ్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైంది. ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌లో జితేంద్ర(25) అనే యువకుడు ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.

మెట్రో స్టేషన్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. పింకి వెనుకాలే ఫాలో అవుతూ వెళ్లిన జితేంద్ర.. తన వెంట తీసుకొచ్చిన కత్తితో ఒక్కసారిగా దాడికి దిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ఆమె పొట్టలో 30 సార్లు పొడిచిన తరువాత గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. మొదట జితేంద్రను అడ్డుకోవడానికి ఒకరు బ్యాగుతో దాడిచేస్తూ ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. చివరికి అక్కడున్న వారు ధైర్యం కూడగట్టుకొని నిందితుడిపై దాడి చేశారు. అయితే అప్పటికే పింకీ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement