మద్యం తాగొద్దు అన్నందుకు టీచర్ ను ఓ విద్యార్థి కత్తితో పొడిచిన సంఘటన ఇంపాల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో చోటుచేసుకుంది.
ఇంపాల్ : మద్యం తాగొద్దు అన్నందుకు టీచర్ ను ఓ విద్యార్థి కత్తితో పొడిచిన సంఘటన ఇంపాల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో చోటుచేసుకుంది. లివా సారెజ్ సమీపంలోని స్కూలు పరిసరాల్లో12వ తరగతి విద్యార్థి మద్యం సేవిస్తుండగా ఉపాధ్యాయుడు అలెక్స్ పమ్మి మందలించాడు. దీంతో ఆగ్రహంతో విద్యార్థి కత్తితో టీచర్ పై అయిదుసార్లు దాడి చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పమ్మి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్నవిద్యార్థి పేరు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.