మహిళలంటే అసహ్యంతో.. ప్రతీకారం | Pakistani takes `revenge` on women by stabbing 17 | Sakshi
Sakshi News home page

మహిళలంటే అసహ్యంతో.. ప్రతీకారం

Published Sat, Aug 20 2016 12:03 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

మహిళలంటే అసహ్యంతో.. ప్రతీకారం - Sakshi

మహిళలంటే అసహ్యంతో.. ప్రతీకారం

సవతి తల్లి దాష్టీకానికి విసుగెత్తిన ఓ పాకిస్తానీ యువకుడు క్రూరంగా మారాడు. ఆమెపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు రోడ్డుపై కనిపించిన మహిళలను కత్తిపోట్లకు గురిచేస్తూ దారుణ ఘటనలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాదిలో 17 మంది మహిళలను కత్తిపోట్లకు గురిచేయగా.. ఓ మహిళా మరణానికి కారణమైనట్టు గారిసన్ నగర రావల్పిండి పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. 22 ఏళ్ల మహ్మద్ అలీ,  రోడ్లపై కనిపించిన మహిళలపై యాధృచ్చికంగా దాడులకు పాల్పడుతున్నట్టు పోలీసు ఇన్వెస్టిగేటర్ మాలిక్ జుల్ఫికర్ హుస్సేన్ తెలిపారు. మహిళలంటే అసహ్యంతోనే వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ ఘటనలకు పాల్పడుతున్నట్టు  అలీ తన క్రూరత్మకాన్ని బయటపెట్టినట్టు హుస్సేన్ చెప్పారు.

జనవరి నుంచి ఈ నెల వరకు 17 మంది మహిళలను కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచినట్టు, ఈ దాడుల్లో ఒక నర్సు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. అలీ చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో, అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. సవతి తల్లిగా అలీ జీవితంలోకి వచ్చిన ఆమె, అతని తీవ్రంగా హింసించేది. ఆ దాష్టీక ఘటనలు భరించలేక అలీ క్రూరంగా మారాడు. సవతితల్లిపై హత్యాయత్నానికి కూడా పాల్పడాడు. అవకాశం చేజిక్కినప్పుడల్లా రోడ్డుపై కనిపించే మహిళలపై దాడులకు పాల్పడుతున్నాడని పోలీసు అధికారి హుస్సేన్ వెల్లడించారు. ఘటనలన్నీ రావల్పిండి వీధుల్లోనే జరిగాయని ఆయన వివరించారు. పరువు హత్యలపై, సాధారణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే దాడులపై వ్యతిరేకంగా పాకిస్తాన్ మహిళలు తమ హక్కుల కోసం గతేళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement