సిడ్నీ మాల్‌లో కత్తిపోట్లు.. అయిదుగురు మృతి | 5 Killed In Sydney Mall Stabbings, Attacker Shot Dead, Says Police | Sakshi
Sakshi News home page

సిడ్నీ మాల్‌లో కత్తిపోట్లు.. అయిదుగురు మృతి

Published Sat, Apr 13 2024 2:45 PM | Last Updated on Sat, Apr 13 2024 3:01 PM

5 Killed In Sydney Mall Stabbings, Attacker Shot Dead Says Police - Sakshi

ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బిజీగా ఉంటే ఓ షాపింగ్‌మాల్‌లో కాల్పులు, కత్తిపోట్ల దాడి జరిగింది. వెస్ట్‌ఫీల్డ్‌  బోండీ జంక్ష‌న్‌లోని మాల్‌లోకి  చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం  3. 40 గంటలకు(భారత కాలమాన ప్రకారం 12.30PM ) వెలుగు చూసింది.

సమాచారం అందుకున్న పోలీసులు మాల్‌లోకి ప్రవేశించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.  కత్తిపోట్లకు గురై మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క‌త్తిపోట్లు, కాల్పులతో ద‌ద్ద‌రిల్లిన ఆ మాల్ నుంచి వంద‌ల సంఖ్య‌లో జ‌నం ప‌రుగులు తీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఆ ప్రాంతంలో ప‌రిస్థితి భ‌యాన‌కంగానే ఉంది. మాల్‌లో ఉన్న వారిని అధికారులు బయటకు పంపించారు. అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో  ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్‌లో తిరగడం కనిపిస్తోంది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి రక్తస్రావాన్ని ఆపేందుకు దుకాణంలోని దుస్తుల్ని ఉపయోగించినట్లు చెప్పారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement