జర‍్మనీలో భారతీయ జంటపై దాడి : భర్త మృతి | Indian couple stabbed by an immigrant near Munich | Sakshi
Sakshi News home page

జర‍్మనీలో భారతీయ జంటపై దాడి : భర్త మృతి

Published Sat, Mar 30 2019 11:35 AM | Last Updated on Sat, Mar 30 2019 11:39 AM

Indian couple stabbed by an immigrant near Munich - Sakshi

మ్యూనిచ్‌ : జర్మనీలో భారతీయ దంపతులపై  ఒక వలసదారుడు దాడికి తెగడ్డాడు. కత్తితో దాడి చేయడంతో  భర్త ప్రశాంత్‌ ప్రాణాలు కోల్పోగా, భార్య స్మిత ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు.  జర్మనీలోని మ్యూనిచ్‌ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా  విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ ట్విటర్‌లో వెల్లడించారు.  ప్రశాంత్‌ సోదరుడిని జర్మనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్వీట్‌ చేశారు.  అలాగే వారి ఇద్దరి  పిల్లల భద‍్రతపై అధికారులకు  తగిన సూచనలు  చేసినట్టు తెలిపారు.  బాధిత కుటుంబానికి సుష్మా సంతాపం వెలిబుచ్చారు.  ఈ ఘటనపై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement