గడిచిన తొమ్మిది నెలల్లో మిజోరాం గవర్నర్లుగా ఆరుగురిగిని మార్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రస్తుత గవర్నర్ అజీజ్ ఖురేషిని కూడా తొలిగించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో తెలపడంతో కేంద్రం శనివారం ఖురేషి తొలిగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన గవర్నర్ ల నియామ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే విమర్శలకు బలం చేకూరినట్లయింది.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీయే హయాంలో నియమితులైన గవర్నర్లను వరుసగా తొలిగిస్తుండటంపై ఆగ్రహించిన ఖురేషీ.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కొంత ఇరకాటంలోపడ్డ కేంద్రం.. అదనుచూసి ఖురేషీపై వేటు వేసింది. జనవరి తొమ్మిదిన మిజోరాం గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అజీజ్.. 2017, ఆగస్టు వరకు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండానే కేంద్రం ఆయనను తొలిగించింది.
తొమ్మిది నెలల్లో ఆరుగురు!
Published Sat, Mar 28 2015 6:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM
Advertisement
Advertisement