
ఐజ్వాల్: మిజోరం నూతన సీఎంగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్‌ఎన్‌ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేయనున్నారు. ఎన్నికల సంఘం నుంచి కొత్తగా ఎన్నికై న శాసనసభా సభ్యుల జాబితా అందడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ జోరంథంగాను ఆహ్వానించారు. మరోవైపు, కొత్త అసెంబ్లీ కొలువుదీరేందుకు ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేశారు. జోరంథంగాతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా? లేదా? అన్నది తెలియరాలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన జోరంథంగా పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఎమ్‌ఎన్‌ఎఫ్ 26 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ 5 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ ఒక సీటు గెలుచుకుని మిజోరంలో బోణీ చేసింది.
కాంగ్రెస్ కొంప ముంచిన ‘మద్యం’
మిజోరంలో 20 ఏళ్లపాటు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యాక 2015లో మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్య నిషేధా న్ని డిమాండ్ చేస్తూ క్రైస్తవ వర్గాలు విస్తృతంగా ఆందోళనలు చేపట్టాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పెడచెవినపెట్టి భారీ మూల్యం చెల్లించుకుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment