
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత హైఫీ(81) సొంత పార్టీకి షాకిచ్చారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హైఫీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ స్పీకర్ లాల్‌రినవ్మకు హైఫీ సోమవారం తన రాజీనామాను సమర్పించగా, ఆయన ఆమోదించారు. స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లా కౌన్సిళ్ల అధికారాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడంతో బీజేపీ లో చేరినట్లు హైఫీ తెలిపారు. హైఫీ అసెంబ్లీకి ఏడుసార్లు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment