స్కూలుకు డుమ్మా కొట్టే స్టూడెంట్స్‌ను చూసి ఉంటారు. కానీ, టీచర్‌ని ఎప్పుడైనా చూశారా! ఫొటోలో కనిపిస్తున్న ఈ టీచర్ ఒక రోజు కాదు, వారం కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలు స్కూలుకు డుమ్మా కొట్టింది. ఇటలీకి చెందిన సింజియా పలైన డిలియో, వెనిస్‌లోని ఓ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది.
ఇరవై నాలుగు సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తను స్కూలుకెళ్లింది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే! అనారోగ్య సెలవులు, కుటుంబ సెలవులు, అనుమతి సెలవులు వంటి వివిధ రకాల సెలవులు పెట్టి, డుమ్మా కొట్టేది. వీటిల్లో కొన్ని రికార్డుల్లో ఉంటే, చాలా వరకు సెలవులు రికార్డుల్లోనే లేవు.
ఈ మధ్యనే స్కూల్ ఇన్‌స్పెక్టర్లు లియో బోధనను పరిశీలించినపుడు, ఆమె గందరగోళంగా పాఠాలను బోధించింది. తర్వాత పనితీరుపై పరీక్ష నిర్వహించినపుడు, విద్యార్థుల నుంచే లియో పుస్తకాలను సేకరించడం గమనించి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.
లియో ఇందుకు ఒప్పుకోలేదు. ఉద్యోగం తిరిగి సాధించుకోవడానికి కోర్టులో కేసు వేసింది. కోర్టు కూడా లియో దాదాపు రెండు దశాబ్దాలు స్కూలుకు హాజరు కాలేదని గుర్తించింది. ‘ఆమెతన ఉద్యోగం తిరిగి పొందలేదు’ అని తీర్పు ఇవ్వడంతో, ఇది కాస్త వైరల్‌గా మారింది.
(చదవండి: చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..)
Comments
Please login to add a commentAdd a comment