500మంది ఉద్యోగులపై వేటు
ముంబై: ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థ ఎల్ అండ్ టీ ఫినాన్స్ హోల్డింగ్స్ 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గ్రామీణ ప్రాంతాలలో గృహ, వాహన, రుణాల కల్పలనలో మంచి పట్టు కలిగి వున్న ఈ సంస్థ కరువు కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులపై తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చైర్మన్, ఎండీ డియోస్తలే తెలిపారు. బాధకరమైనా, తప్పలేదని పేర్కొన్నారు. వివిధ సెక్టార్లలో పేలవమైన ప్రదర్శన చూపించిన ఉద్యోగులను తొలగించినట్టు చెప్పారు. ముఖ్యంగా రీటైల్, రూరల్ సెగ్మంట్లలో పూర్ పెర్మాన్స్ కనబర్చిన వారికి ఉద్వాసన పలికినట్టు వెల్లడించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది తమ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుణాలను తీసుకున్న రైతులు, తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారన్నారు. రుతుపవనాలు వైఫల్యాలతో ఒత్తిడి చాలా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పరికరాల ఫైనాన్స్ లో తమ వ్యాపారం క్షీణించిందని తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు కారణంగా పలువురు రైతుల పరిస్థితి దిగజారిందనీ, దీంతో ట్రాక్టర్లకు డిమాండ్ తగ్గడంతో పాటు రుణాల చెల్లింపులో సామర్థ్యం తగ్గిందన్నారు. ఈ పరిస్థితి మరో అయిదారు నెలలు వ్యవసాయ రంగంలో ఒత్తిడి చూడవచ్చన్నారు. ఈ ఏడాది రెండవ సగంలో పరిస్థితి మెరుగుపడవచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కాగా మంగళవారం కంపెనీ ప్రకించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ 237 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం వృద్ధిలో 15 శాతం పెరుగుదల నమోదు చేసింది.