nagapur
-
నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీ
-
ఐటీఎఫ్ టోర్నీలో శ్రేయ ముందంజ..
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రేయ 6–1, 6–1తో భారత్‌కే చెందిన పావని పాఠక్‌పై గెలిచింది. తొలి రౌండ్లో శ్రేయ 6–2, 6–2తో హిమాన్షికను ఓడించింది. తెలంగాణ ప్లేయర్ స్మృతి భాసిన్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోగా... సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో స్మృతి 6–2, 6–7 (8/10), 12–10తో కల్లూరి లాలిత్యపై నెగ్గగా... సాయిదేదీప్య 6–2, 2–6, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో వన్షిత చేతిలో ఓడింది. చదవండి: రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ -
మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..
నాగ్‌పూర్(మహరాష్ట్ర): మహరాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నాగపూర్‌కు చెందిన మాజీ బీజేపీ నాయకుడు, కార్పొరేటర్ రవీంద్ర భోయార్ సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రవీంద్ర భోయార్.. మహరాష్ట్ర కెబినెట్ మంత్రి నితిన్ రౌత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో.. సునీల్ కేదార్, నాగ్‌పూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికాస్ ఠాక్రే తదితరులు పాల్గోన్నారు. చదవండి: అమరులకే ఇవ్వలేదు.. పంజాబ్ రైతులకిస్తారా? -
వారం రోజులు లాక్డౌన్.. తెరచి ఉంచేవివే..
సాక్షి, ముంబై/ఔరంగాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో పర్భణి, అకోలా జిల్లాల్లో లాక్డౌన్ విధించనున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. పర్భణి జిల్లాలోని నగర పరిమితులు, పట్టణాల్లో రెండు రోజుల కర్ఫ్యూ విధించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. శనివారం అర్ధరాత్రి మొదలై సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీలకు 3 కిలోమీటర్ల పరిధి వరకు కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలు, మెడికల్ సోర్ట్స్, ఆస్పత్రులతో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. హోం డెలవరీలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారికి, కరోనా పరీక్షలు చేయించుకునే వారికి మినహాయింపు ఉంటుందన్నారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో ఉన్న ప్రార్థన మందిరాలు కూడా మార్చి 31 వరకు మూసే ఉంటాయని తెలిపారు. అందులోని పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు అకోలాలో శుక్రవారం రాత్రి 8 గంటల నంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు లాక్డౌన్ ఉంటుందని జిల్లా అధికారులు వెల్లడించారు. నాగపూర్‌లో వారం రోజులు లాక్డౌన్.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే నాగ్‌పూర్‌లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి నితిన్ రావుత్ ప్రకటించారు. అనంతరం పరిస్థితులను బట్టి లాక్డౌన్ కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలందించే కార్యాలయాలు, మార్కెట్లు, మెడికల్ షాపులు, కిరాణ షాపులు మినహా బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు ఇతరాలు అన్ని మూసే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రావుత్ హెచ్చరించారు. తెరిచి ఉండేవి.. ►బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, కూరగాయల మార్కెట్లు, కోడి గుడ్లు, చికెన్, మటన్ షాపులు, కళ్ల అద్దాల షాపులు. ►పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు (25 శాతం హాజరు). ►ఈ ఆర్థిక సంవత్సరం పనులు చూసుకునే కార్యాలయాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. ►కరోనా టీకా కేంద్రాలు, ఆస్పత్రులు, పారామెడికల్, అత్యవసర సేవలు. ►తినుబండరాలు విక్రయించే షాపులు, మద్యం ఇంటికే డెలివరీ చేసే సేవలు(ఐడీ కార్డు తప్పని సరిగా ఉండాలి). మూసి ఉండేవి.. ►ప్రైవేటు ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, మైదానాలు, ఫంక్షన్ హాళ్లు. ఆటో, ట్యాక్సీలు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, స్కూళ్లు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) -
తల్లితో వివాహేతర సంబంధం.. బుద్ధి చెప్పేందుకు
ముంబై: తల్లితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కిడ్నాప్‌నకు యత్నించి పోలీసులకు చిక్కాడు మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల బాలుడు. నాగ్‌పూర్‌కి చెందిన బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్‌పై తీసుకెళ్లే క్రమంలో, బాధితుడు తప్పించుకోవడంతో విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్జీ హౌస్ చౌక్ ప్రాంతంలో నివాసముంటున్న బాలుడి తల్లి, ప్రదీప్ నందన్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై ఆమె, ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలత చెందిన బాలుడు తన తల్లి ప్రియుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నందన్వర్ కిడ్నాప్‌నకు కుట్ర పన్నాడు. (చదవండి: సవతి తల్లిపై నటుడి అత్యాచారం! ) ఈ క్రమంలో ముగ్గురు యువకులు కలిసి నందన్వర్ పని చేసే కార్యాలయం నుంచి అతన్ని అపహరించి బైక్‌పై తీసుకెళ్తుండగా, ఓ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనపడటంతో నందన్వర్ రన్నింగ్ బైక్ నుంచి దూకేశాడు. పోలీసులను గమనించిన యువకులు నందన్వర్‌ను వదిలేసి పరారయ్యారు. నిందితుల నుంచి తప్పించుకున్న నందన్వర్ బాలుడి తల్లికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం అంగీకరించారు. ఆ ముగ్గురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు -
సాయిబాబా అడిగినవి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: భీమా–కోరెగావ్ ఘటనలో ప్రమే యముందన్న ఆరోపణలపై నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు, 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న డాక్టర్.జి.ఎన్. సాయిబాబాకు అవస రమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వెంటనే అందజేయాలని జైలు అధికారులకు పౌరహక్కుల నేత, ‘కమిటీ ఫర్ ద డిఫెన్స్, రిలీజ్ ఆఫ్ జీఎన్ సాయిబాబా’ కన్వీనర్ ప్రొ.జి. హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. మందులు, లేఖలు, అధ్యయనానికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడం వంటి ప్రతీ ఖైదీకి అందాల్సిన మౌలిక హక్కులను కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు సాయిబాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోరుతున్న వాటిని అందజేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ప్రొ.జి.హరగోపాల్ విన్నవించారు. సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, కరోనా సోకే ప్రమాదమూ ఉన్నందున ఆయన్ను అనవసర ఆంక్షలతో వేధించవద్దని కోరారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సాయిబాబాను కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలు సుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఆప్తులు, మిత్రుల లేఖలు అందజేయడంతో పాటు, ఆయన కోరిన పుస్తకాలూ ఇవ్వాలని పేర్కొ న్నారు. న్యాయవాది ఇచ్చిన మందులు, పుస్తకాలు కూడా సాయిబాబాకు చేరనివ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో మాతృమూర్తి అంత్యక్రియలకూ అనుమతినివ్వకపోవడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెరోల్/మెడికల్ బెయిల్ ఇవ్వకపో వడంతో ప్రస్తుతం కరోనా కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిం దన్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్య వాదులు, సంస్థలు స్పందించి నాగ్‌పూర్ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపడం ద్వారా సాయిబాబా హక్కులు కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఈ నెల 15న సాయిబాబా భార్య వసంతకుమారి వినతిపత్రం పంపించారని హరగోపాల్ తెలిపారు. ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా నిరాహార దీక్షకు దిగకుండా ఆయన అడిగినవి ఇవ్వాలని కోరారు. -
షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం
-
నాగాపూర్‌లో బాల్య వివాహం?
హవేళిఘణాపూర్(మెదక్): కుల పెద్దల సమక్షంలో బాల్య వివాహం జరిగిన సంఘటన మండల పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగాపూర్ గ్రామానికి చెందిన బాల్‌రాజుకు అదే గ్రామానికి చెందిన 17.3 సంవత్సరాల అమ్మాయితో తొగిట రామస్వామి ఆలయంలో సోమవారం వివాహం జరిగింది. అమ్మాయి మైనర్ అని తెలిసీ కులపెద్దలు వివాహం జరిపించారని విశ్వసనీయ సమాచారం. వివా హానికి అమ్మాయి తల్లిదండ్రులు హాజరు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ ఎసీడీపీఓ హేమసత్య, అంగన్వాడీ టీచర్ మంగమ్మ మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించేందుకు యత్నించారు. అమ్మాయి, అబ్బాయి లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. పెళ్లి సంగతి తమకేమీ తెలియదని వారు చెప్పినట్టు తెలిసింది. ఎస్ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా బాల్య వివాహం జరిగినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
జనవరిలో ఎంఆర్వో కేంద్రాల ప్రారంభం: ఎయిర్ ఇండియా
హైదరాబాద్: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియా.. హైదరాబాద్, నాగ్‌పూర్‌లోని మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్వో) యూనిట్లలో కార్యకలాపాలను జనవరిలో ప్రారంభిస్తోంది. బేగంపేటలో ఎయిర్ ఇండియా కార్యకలాపాలన్నీ శంషాబాద్ విమానాశ్రయానికి తరలుతాయి. అంటే విమాన నిర్వహణ పరీక్షలు ఇక నుంచి శంషాబాద్ ఎంఆర్వో కేంద్రంలో జరుగుతాయి. బేగంపేట నుంచి శంషాబాద్‌కు 2008లో విమానాశ్రయం తరలించారు. కేవలం పరీక్షల కోసమే విమానాలను బేగంపేటకు తీసుకువెళ్తుండడంతో ఎయిర్ ఇండియాకు వ్యయాలు తడిసిమోపెడు అవుతున్నాయి. హైదరాబాద్, నాగ్‌పూర్ కేంద్రాలను ఎయిర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్) నిర్వహిస్తుంది. తొలుత ఎయిర్ ఇండియా విమానాలకు సేవలు అందిస్తుంది. ఇతర సంస్థలకూ సేవలు విస్తరించే అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఎంఆర్వో ఫెసిలిటీ భారత్‌లో లేదు. ఏఐఈఎస్కు ముంబైలో డీజీసీఏ అనుమతి కలిగిన ఎంఆర్వో ఫెసిలిటీ ఉంది. అయితే ఈ కేంద్రంలో బోయింగ్ విమానాలను మాత్రమే పరీక్షిస్తున్నారు. -
రాజకీయ ఎజెండా లేదు
వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసే వారి వెంట ఉంటాం నాగపూర్: విశ్వ హిందూ పరి షత్ (వీహెచ్‌పీ)కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని ఆ సంస్థ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. తాము ఏ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన నాగపూర్‌లో మంగళవారం విలేకరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల కోసం నిస్వార్ధ సేవ చేయాలనుకునేవారికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘వీహెచ్‌పీకి ఎలాంటి రాజకీయ ఏజెండా లేదు. సంస్థ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. అయితే లక్షలాది మంది హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసేవారి వెంట ఉంటామ’ని ఆయన స్పష్టం చేశారు. రామాలయం, ఉమ్మడి పౌర స్మృతి, అర్టికల్ 370, గో వధ తదితర అంశాలను పార్టీలు మరిచిపోతున్నాయన్నారు. అయితే ప్రజాప్రతినిథులను ఎన్నుకునే ముందు గతంలో వారి ప్రదర్శన ఎలాగుంది, వారి పార్టీ పనితీరు ఎలా ఉంది తదితర పరిశీలించాకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. రూ.700 కోట్లతో మైనారిటీ అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేస్తూ యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అత్యధిక జనాభా ఉన్న హిందువులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటి పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. లక్షలాది మంది హిందువులు పేదరిక జీవనస్థాయిలోనే ఉంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చదువుల కోసం ఆర్థిక సహకారం కావాల్సిన హిందూ విద్యార్థుల్లో పేదవాళ్లు లేరా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు వీహెచ్‌పీ నేతేనని, ఆయన ఆలోచనలను పార్టీ నుంచి వేరు చేయలేం కదా అని విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, పేద రోగుల కోసం లంచ్ ఇండియా హెల్త్‌లైన్ (ఐహెచ్ఎల్)ను నాగపూర్‌లో తొగాడియా ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్క ఫోన్‌కాల్‌తో పేద హిందువులకు ఉచిత ఆరోగ్య సేవలందించేందుకు ఐహెచ్ఎల్ను ప్రారంభించామన్నారు. రోగముందని తెలిసినా డబ్బులు లేక అనేక మంది ఆస్పత్రులు వెళ్లడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పుణే, ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లోనూ త్వరలోనే ఐహెచ్ఎల్ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. -
మంత్రులు తక్షణమే తప్పుకోవాలి : బీజేపీ
నాగపూర్: పాలకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ఖడ్సేతోపాటు, ఆ పార్టీ సభ్యుడు నానాపటోల్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. వారంతట వారు తప్పుకోకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరినీ తక్షణమే కచ్చితంగా తప్పించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కేసు నమోదు చేయాలంటూ జల్గావ్ కోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. దీంతో ఉపసభాపతి వసంత్ఫుర్కే సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత బీజేపీ సభ్యులు మరోసారి గందరగోళం సృష్టించారు. దీంతో ఉపసభాపతి రోజంతా సభను వాయిదావేశారు. కాగా జల్గావ్ మిల్క్ గ్రోయర్స్ అసోసియేషన్‌ను జాతీయ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదలాయింపులో రూ. 3.18 కోట్ల మేర కుంభకోణం జరిగిందని బీజేపీ సభ్యులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. -
నేటి నుంచే అసెంబ్లీ
నాగపూర్: ప్రతిసారి మాదిరినే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కని పిస్తున్నాయి. నాగపూర్‌లో సోమవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఆదర్శ్ కుంభకోణం, మూఢాచారాల వ్యతిరేక బిల్లు వంటి అంశాలపై చర్చోపచర్చలు నడుస్తాయని చెప్పవచ్చు. కేంద్రమంత్రి రాజీవ్ శుక్లాకు ముంబైలో నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడంపైనా విపక్షాలు గొడవకు దిగే అవకాశాలున్నాయి. ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన మూఢాచారాల వ్యతిరేక బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించడం తెలిసిందే. దభోల్కర్ హత్య కేసులో ఇప్పటికీ పురోగతి లేకపోవడంపైనా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. దాదాపు 13-14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వార్కారీల సంఘాలు ప్రకటించాయి. విశేషమేమంటే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమావేశాల తొలిరోజు బంద్‌కు పిలుపునిచ్చే విపక్షాలు ఈసారి మాత్రం ఆ పని చేయలేదు. ప్రధాన ప్రతిపక్షం బీజే పీ మాత్రం విదర్భ ప్రాంతంలో రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. అధిక వర్షాలతో పంటలు కోల్పోయిన విదర్భ రైతులకు పరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపిం ది. ఆదర్శ్ కుంభకోణంలో చర్యల నివేదికను సభ లో ప్రవేశపెట్టాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బీజేపీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంపై ఇంటాబయ టా పోరాడుతామని స్పష్టం చేసింది. ఈ కేసు బాధ్యతను స్వీకరించిన సీబీఐ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను కోరింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భవనంలో చవాన్ తన బంధువులకు ఫ్లాట్ ఇప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక నీటిపారుదలశాఖ ప్రాజెక్టుల స్తంభన అంశం కూడా ఈసారి చర్చకు వచ్చే అవకాశముంది. ఈ శాఖ గణాంకాలపై విపక్షాలు ఇది వరకే సందేహాలు వ్యక్తం చేశా యి. విదర్భలో రూ.66 వేల కోట్ల విలువైన నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని సభ లో విపక్షనాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు. విదర్భలో తగిన నీటిపారుదల సదుపాయాలు లేక పంటలు నాశనమవుతుండడంతో అక్కడ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్నాయని ప్రధాని నియమించిన మిశ్రా కమిటీ 2006లోనే ప్రకటించింది. గత పదేళ్లలో విదర్భలో కేవలం 8.10 లక్షల హెక్టార్లకు మాత్రమే నీటిపారుదల సదుపాయం కల్పించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని తావ్డే అన్నారు. దీనిని బట్టి విదర్భపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నట్టు రుజువవుతోం దని స్పష్టం చేశారు. యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ సైతం ప్రత్యేక విదర్భ కోసం పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణతోపాటు విదర్భ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విపక్షాలతో ముఖ్యమంత్రి చర్చలు విధానసభ సమావేశాలకు ముందు రోజులు సభ సంప్రదాయాల ప్రకారం విపక్షాలకు ఇవ్వాల్సిన తేనీటి విందును ప్రభుత్వం రద్దు చేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటయోధుడు నెల్సన్ మండే లా మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అధికార పక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయా న్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విపక్ష నాయకులను ఆహ్వానించారు. ఈ భేటీకి తాము హాజరయ్యామని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ప్రకటించింది. -
విదర్భ ప్రాంతంలో జౌళి పరిశ్రమ విస్తరణ
నాగపూర్: విదర్భ ప్రాంతంలో రాష్ట్ర జౌళి మంత్రిత్వ శాఖ భారీ విస్తరణ ప్రణాళిక చేపట్టింది. రూ. 1,800 కోట్ల వ్యయంతో 15 వేల ఉద్యోగాలు కల్పిం చేం దుకు అధికార వర్గాలు ఓ ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం 500 జౌళి పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, మరి కొన్ని పరిశ్రమలను నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జౌళి శాఖ మంత్రి మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 14 టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, వీటి పెట్టుబడుల విలువ 16 వేల కోట్ల రూపాయలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 టెక్స్టైల్ పార్కులు ఉన్నాయని ఆయన వివరించారు. విదర్భ ప్రాంతంలో సంవత్సరానికి 90 లక్షల బెయిళ్ల పత్తి పండిస్తున్నారని, ఇందులో కొంతమాత్రమే రాష్ట్ర పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని, మిగతాది ఎగుమతి అవుతుందన్నారు. -
9 నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు
సాక్షి, ముంబై: శాసనసభ శీతాకాల సమావేశాలు వచ్చే నెల తొమ్మిదో తేదీనుంచి నాగపూర్‌లో ప్రారం భం కానున్నాయి. ఈ సమావేశాలను రెండు వారాలకు బదులుగా మూడు వారాలు నిర్వహించేలా చూడాలని శాసనసభ కార్యకలాపాల సలహాదారుల సమితి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 2001 నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు రెండు వారాలు మాత్రమే జరుగుతున్నాయని, అందువల్ల రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిస్థాయిలో చర్చకు రాని పరిస్థితి కొనసాగుతోందని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశాయి. 1995లో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి హయాం లో మినహా కేవలం ఎనిమిది నుంచి 12 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. 1995లో శీతాకాల సమావేశాలు డిసెంబరు ఏడో తేదీ నుంచి 22దాకా కొనసాగాయి. ఇందులో ఉభయ సభల్లో 14 చొప్పున సమావేశాలు జరిగాయి.