నాగాపూర్‌లో బాల్య వివాహం? | Child marriage in Nagapur | Sakshi
Sakshi News home page

నాగాపూర్‌లో బాల్య వివాహం?

Oct 18 2017 1:28 PM | Updated on Oct 18 2017 1:28 PM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): కుల పెద్దల సమక్షంలో బాల్య వివాహం జరిగిన సంఘటన మండల పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగాపూర్‌ గ్రామానికి చెందిన బాల్‌రాజుకు అదే గ్రామానికి చెందిన 17.3 సంవత్సరాల అమ్మాయితో తొగిట రామస్వామి ఆలయంలో సోమవారం వివాహం జరిగింది. అమ్మాయి మైనర్‌ అని తెలిసీ కులపెద్దలు వివాహం జరిపించారని విశ్వసనీయ సమాచారం. వివా హానికి అమ్మాయి తల్లిదండ్రులు హాజరు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ ఎసీడీపీఓ హేమసత్య, అంగన్‌వాడీ టీచర్‌ మంగమ్మ మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించేందుకు యత్నించారు. అమ్మాయి, అబ్బాయి లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. పెళ్లి సంగతి తమకేమీ తెలియదని వారు చెప్పినట్టు తెలిసింది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా బాల్య వివాహం జరిగినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement