జనవరిలో ఎంఆర్‌వో కేంద్రాల ప్రారంభం: ఎయిర్ ఇండియా
హైదరాబాద్: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియా.. హైదరాబాద్, నాగ్‌పూర్‌లోని మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్‌వో) యూనిట్లలో కార్యకలాపాలను జనవరిలో ప్రారంభిస్తోంది. బేగంపేటలో ఎయిర్ ఇండియా కార్యకలాపాలన్నీ శంషాబాద్ విమానాశ్రయానికి తరలుతాయి. అంటే విమాన నిర్వహణ పరీక్షలు ఇక నుంచి శంషాబాద్ ఎంఆర్‌వో కేంద్రంలో జరుగుతాయి. బేగంపేట నుంచి శంషాబాద్‌కు 2008లో విమానాశ్రయం తరలించారు.
కేవలం పరీక్షల కోసమే విమానాలను బేగంపేటకు తీసుకువెళ్తుండడంతో ఎయిర్ ఇండియాకు వ్యయాలు తడిసిమోపెడు అవుతున్నాయి. హైదరాబాద్, నాగ్‌పూర్ కేంద్రాలను ఎయిర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్) నిర్వహిస్తుంది. తొలుత ఎయిర్ ఇండియా విమానాలకు సేవలు అందిస్తుంది. ఇతర సంస్థలకూ సేవలు విస్తరించే అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఎంఆర్‌వో ఫెసిలిటీ భారత్‌లో లేదు. ఏఐఈఎస్‌కు ముంబైలో డీజీసీఏ అనుమతి కలిగిన ఎంఆర్‌వో ఫెసిలిటీ ఉంది. అయితే ఈ కేంద్రంలో బోయింగ్ విమానాలను మాత్రమే పరీక్షిస్తున్నారు.