నాగపూర్: ప్రతిసారి మాదిరినే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కని పిస్తున్నాయి. నాగపూర్‌లో సోమవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఆదర్శ్ కుంభకోణం, మూఢాచారాల వ్యతిరేక బిల్లు వంటి అంశాలపై చర్చోపచర్చలు నడుస్తాయని చెప్పవచ్చు. కేంద్రమంత్రి రాజీవ్ శుక్లాకు ముంబైలో నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడంపైనా విపక్షాలు గొడవకు దిగే అవకాశాలున్నాయి. ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన మూఢాచారాల వ్యతిరేక బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించడం తెలిసిందే.
దభోల్కర్ హత్య కేసులో ఇప్పటికీ పురోగతి లేకపోవడంపైనా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. దాదాపు 13-14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వార్కారీల సంఘాలు ప్రకటించాయి. విశేషమేమంటే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమావేశాల తొలిరోజు బంద్‌కు పిలుపునిచ్చే విపక్షాలు ఈసారి మాత్రం ఆ పని చేయలేదు. ప్రధాన ప్రతిపక్షం బీజే పీ మాత్రం విదర్భ ప్రాంతంలో రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. అధిక వర్షాలతో పంటలు కోల్పోయిన విదర్భ రైతులకు పరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపిం ది. ఆదర్శ్ కుంభకోణంలో చర్యల నివేదికను సభ లో ప్రవేశపెట్టాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ మేరకు బీజేపీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంపై ఇంటాబయ టా పోరాడుతామని స్పష్టం చేసింది. ఈ కేసు బాధ్యతను స్వీకరించిన సీబీఐ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను కోరింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భవనంలో చవాన్ తన బంధువులకు ఫ్లాట్ ఇప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక నీటిపారుదలశాఖ ప్రాజెక్టుల స్తంభన అంశం కూడా ఈసారి చర్చకు వచ్చే అవకాశముంది. ఈ శాఖ గణాంకాలపై విపక్షాలు ఇది వరకే సందేహాలు వ్యక్తం చేశా యి. విదర్భలో రూ.66 వేల కోట్ల విలువైన నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని సభ లో విపక్షనాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు. విదర్భలో తగిన నీటిపారుదల సదుపాయాలు లేక పంటలు నాశనమవుతుండడంతో అక్కడ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్నాయని ప్రధాని నియమించిన మిశ్రా కమిటీ 2006లోనే ప్రకటించింది. గత పదేళ్లలో విదర్భలో కేవలం 8.10 లక్షల హెక్టార్లకు మాత్రమే నీటిపారుదల సదుపాయం కల్పించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని తావ్డే అన్నారు. దీనిని బట్టి విదర్భపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నట్టు రుజువవుతోం దని స్పష్టం చేశారు. యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ సైతం ప్రత్యేక విదర్భ కోసం పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణతోపాటు విదర్భ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
విపక్షాలతో ముఖ్యమంత్రి చర్చలు
విధానసభ సమావేశాలకు ముందు రోజులు సభ సంప్రదాయాల ప్రకారం విపక్షాలకు ఇవ్వాల్సిన తేనీటి విందును ప్రభుత్వం రద్దు చేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటయోధుడు నెల్సన్ మండే లా మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అధికార పక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయా న్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విపక్ష నాయకులను ఆహ్వానించారు. ఈ భేటీకి తాము హాజరయ్యామని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ప్రకటించింది.
నేటి నుంచే అసెంబ్లీ
Published Sun, Dec 8 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement