
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రేయ 6–1, 6–1తో భారత్‌కే చెందిన పావని పాఠక్‌పై గెలిచింది. తొలి రౌండ్‌లో శ్రేయ 6–2, 6–2తో హిమాన్షికను ఓడించింది. తెలంగాణ ప్లేయర్ స్మృతి భాసిన్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోగా... సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో స్మృతి 6–2, 6–7 (8/10), 12–10తో కల్లూరి లాలిత్యపై నెగ్గగా... సాయిదేదీప్య 6–2, 2–6, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో వన్షిత చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment