ITAF tournment
-
రన్నరప్ రష్మిక జంట
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–శ్రీవల్లి రష్మిక జంట రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో సాత్విక–రష్మిక ద్వయం 6–3, 4–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సోహా సాదిక్–చామర్తి సాయి సంహిత (భారత్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ అనా ఉరెకె (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో సహజ తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. నేడు జరిగే ఫైనల్లో ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ)తో సహజ తలపడుతుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన శ్రీవల్లి రష్మిక
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో రష్మిక 6–4, 6–3తో షర్మదా బాలు (భారత్)పై, సాత్విక 7–5, 6–2తో అదితి (భారత్)పై, శ్రేయ 6–3, 5–7, 6–3తో జగ్మీత్ కౌర్ గ్రెవాల్ (భారత్)పై గెలిచారు. చెస్ ఒలింపియాడ్ ఆతిథ్యానికి భారత్ బిడ్ అఖిల భారత చెస్ సమాఖ్య ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేయనుంది. ఇందులో భాగంగా గ్యారంటీ మనీ కోటి డాలర్లను (రూ. 74 కోట్లు) అంతర్జాతీయ చెస్ సమాఖ్యకు డిపాజిట్ చేసింది. నిజానికి ఈ చెస్ మెగా టోర్నీ ఈ జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు రష్యాలో జరగాల్సింది. అయితే ఆ దేశం ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధం చేస్తుండటంతో అక్కడ ఈవెంట్‌ను రద్దు చేసి తాజాగా బిడ్లను ఆహ్వానించారు. చదవండి: Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..! -
ఐటీఎఫ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు సౌజన్య అర్హత
బెన్‌డిగో ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య బవిశెట్టి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సౌజన్య 7–5, 7–5తో మూడో సీడ్, భారత్‌కే చెందిన రుతుజా భోస్లేపై గెలిచింది. తొలి రౌండ్లో సౌజన్య 6–1, 6–0తో ఒలివియా (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో టాప్ సీడ్ సుజియోంగ్ జాంగ్ (దక్షిణ కొరియా)తో సౌజన్య ఆడుతుంది. చదవండి: SA vs NZ: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ఘన విజయం -
ఐటీఎఫ్ టోర్నీలో శ్రేయ ముందంజ..
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రేయ 6–1, 6–1తో భారత్‌కే చెందిన పావని పాఠక్‌పై గెలిచింది. తొలి రౌండ్లో శ్రేయ 6–2, 6–2తో హిమాన్షికను ఓడించింది. తెలంగాణ ప్లేయర్ స్మృతి భాసిన్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోగా... సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో స్మృతి 6–2, 6–7 (8/10), 12–10తో కల్లూరి లాలిత్యపై నెగ్గగా... సాయిదేదీప్య 6–2, 2–6, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో వన్షిత చేతిలో ఓడింది. చదవండి: రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ -
సింగిల్స్ చాంప్ సాకేత్
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్‌లైన్: డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని సింగిల్స్‌లోనూ మెరిశాడు. శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఈ వైజాగ్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-3, 6-1తో రెండో సీడ్ సనమ్ సింగ్ (భారత్)ను ఓడించాడు. 10 ఏస్‌లతో అదరగొట్టిన సాకేత్ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. డబుల్స్‌లో తన భాగస్వామిగా ఉన్న సనమ్ సింగ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు సనమ్ సింగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 2012లో ఇదే టోర్నీ ఫైనల్లో సనమ్ సింగ్ చేతిలో మూడు సెట్ల పోరాటంలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న సాకేత్ ఈ ఏడాది మాత్రం అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి బదులు తీర్చుకోవడం విశేషం. భారత డేవిస్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న సాకేత్ కెరీర్లో ఇది 9వ ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్.