
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–శ్రీవల్లి రష్మిక జంట రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో సాత్విక–రష్మిక ద్వయం 6–3, 4–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సోహా సాదిక్–చామర్తి సాయి సంహిత (భారత్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
రెండో సీడ్ అనా ఉరెకె (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో సహజ తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్‌లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. నేడు జరిగే ఫైనల్లో ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ)తో సహజ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment