ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. అయితే బీజేపీ ఆరోపణలను ఎంపీ సుప్రియా సూలే బుధవారం తోసిపుచ్చారు. బీజేపీ ఎంపీ విలేకరుల సమావేశంలో ప్లే చేసిన ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని, అవన్నీ కిలీవని పేర్కొన్నారు.
కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మాజీ పోలీస్ కమిషనర్ ఓ డీలర్‌తో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో కొన్ని ఆడియో క్లిప్‌లను ప్లే చేశారు.
క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో వీరికి ప్రమేయం ఉందని, ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం ఇద్దరు నేతలు బిట్‌కాయిన్ మానిప్యులేషన్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా లభించిన నగదును మహారాష్ట్రలో ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారని పాటిల్ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.
#WATCH | Baramati: On allegations against her and Nana Patole, NCP-SCP MP Supriya Sule says "Yesterday, all these voice recordings were sent to me by the media. The first thing I did was to call the Commissioner of Pune and tell him that some fake videos were running and I wanted… pic.twitter.com/vhoNS3vxLr
— ANI (@ANI) November 20, 2024
బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన సుప్రియా సూలే.. బీజేపీ ఆరోపణలపై స్పందించారు. ‘అది నా వాయిస్ కాదు. ఆ వాయిస్ నోట్స్, మెసేజ్‌లన్నీ నకిలీవి’ అని స్పష్టం చేశారు.. ఆమె మాట్లాడుతూ.. ఇది తన వాయిస్ లేదా నానా పటోలేది కాదని తెలిపారు. తన పేరు మీద నకిలీ వాయస్ సృష్టించారని, దీనికి వెనక ఉన్నవారిని పోలీసులు పట్టుకుంటారని తెలిపారు.
‘నేను బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడాను. దాని గురించి తీవ్రమైన సమస్యలను లేవనెత్తిన వ్యక్తిని నేను. వాటికి (బీజేపీ) సమాధానం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పూర్తి పారదర్శకతను విశ్వసించే వ్యక్తిని కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. బీజేపీ అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
దీనిపై పుణె కమిషనర్‌కు ఈ ఆడియోలు, వీడియోలు పంపించి.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. మహారాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం ఉంది. రుజువు లేకుండా ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయరని భావిస్తున్నానని తెలిపారు.
సుధాన్షు త్రివేదికి పరువు నష్టం నోటీసులు పంపినట్లు తెలిపారు.. ‘నా లాయర్ల ద్వారా సుధాన్షు త్రివేదికి క్రిమినల్ పరువు నష్టం నోటీసులు పంపాను. సుధాన్షు త్రివేదిి ఏ ఊరిలో కావాలన్నా, ఏ ఛానెల్‌లో కావాలన్నా, ఏ సమయంలో కావాలన్నా, ఎక్కడికి పిలిచినా నేను వచ్చి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను లేదు, అబద్ధాలు, ఆరోపణలన్నీ అబద్ధం అని సమాధానం ఇస్తాను’ అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment