ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.
‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్‌కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.
కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.
నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.
కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్‌లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment