గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత
హైదరాబాద్ : గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామని బీజేపీ ప్రకటన నేపథ్యంలో అటువైపు వెళ్లే అన్ని దారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా దళాలు మోహరించాయి.
కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గోల్కొండ కోటపై విమోచన దినోత్సవాల నిర్వహణపై ప్రభుత్వం స్పందించకుంటే తామే రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని బీజేపీ ప్రకటన చేసింది. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.