
గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్
హైదరాబాద్: గోల్కొండ కోట సందర్శకులకు శుభవార్త. లోపలికి అడుగు పెట్టిన దగ్గర్నుంచి కోట పైకి ఎక్కి.. మళ్లీ దిగేవరకు ఆయాసం, చెమటలు అందరికీ అనుభవమే. అయితే ఇకపై ఈ బాధలన్నీ తీరిపోనున్నాయ్. పర్యాటకులు ఎంచక్కా గోల్కొండ కోటలోని స్విమ్మింగ్ పూల్ లో చల్లటి స్నానం చేసి బడలికను ఒదిలించుకోవచ్చు. ఇంతకీ ఆ ఈత కొలను ఎక్కడుందాంటారా..
కోటలోని షాహతిమ్ చెరువు లేదా కటోరా హౌస్ కుంటలను స్విమ్మింగ్ పూల్స్గా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శుక్రవారం షాహతిమ్, కటోరా చెరువులను సందర్శించారు. ఈ రెండు చెరువుల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని రూ. 1.25 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ను నిర్మించనున్నట్లు సోమేశ్ చెప్పారు. తర్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. చారిత్రక గోల్కొండ కోటలోనే తెలంగాణ ప్రభుత్వం జెండా పండుగ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.