గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్‌ | Telangana government To Host Dinner For Ivanka reached Golconda Fort | Sakshi
Sakshi News home page

గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్‌

Published Wed, Nov 29 2017 6:51 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోట చేరుకున్నారు. జీఈఎస్‌కు హాజరైన ఇవాంకా ట్రంప్ రెండో రోజు బిజీబిజీగా గడిపారు. ఈ రోజు ఉదయం సమిట్లో సెషన్లకు హాజరైన ఆమె తర్వాత చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రత మధ్య ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటకు విచ్చేశారు. అక్కడ ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఇవాంకా వెంట తెలంగాణ సీఎస్ కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement