
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్: గోల్కొండ వేదికగా 69వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోల్కొండ వేదికగా గ్రామజ్యోతి పథకాన్ని ప్రకటించారు. ఉదయం 9.20 గంటలకు సికింద్రాబాద్లో అమరవీరుల, సైనిక స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం 9.50 గంటలకు గోల్కొండ చేరుకున్నారు. అక్కడ రాణీమహల్ వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
* 30 ఏళ్లు చాలా కష్టపడ్డాం
* తెలంగాణ వస్తే చీకటి అన్నారు
* కోతలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నాం
* వచ్చే మార్చి నుంచి ఉదయం పూటే 9 గంటల విద్యుత్
* మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం
* 46వేల చెరువులను ఏటా 9వేల చెరువుల అభివృద్ధి
* పశ్చిమ బెంగాల్ హైకోర్టు మన పారిశ్రామిక రంగాన్ని మెచ్చుకుంది
* పారిశ్రామిక రంగంలో సింగిల్ విండో విధానం అమలు
* నాలుగు, రెండు లేన్ల రోడ్డు శరవేగంగా సాగుతోంది
* 17వేల కోట్ల రుణాలు మాఫీ
* 8500 కోట్లను ఇప్పటికే రైతులకు అందించాం
* అన్ని రంగాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం
* మిగులు రాష్ట్రం కోసం 91500 కోట్లు సమకూర్చుకున్నాం
* దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది
* మిషన్ కాకతీయతో ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించాం
* హైదరాబాద్కు నీటి కొరత రాకుండా రెండు రిజర్వాయర్లు
* కాగితాలకే ప్రాజెక్టులు పరిమితమయ్యాయి
* తెలంగాణ వైభవానికి గోల్కొండ కోట నిలువెత్తు నిదర్శనం
* సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది
* రూ.480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు అందజేస్తాం
* టీ-పాస్ చట్టం కింద పరిశ్రమల స్థాపనకు రెండు వారాల్లోనే అనుమతులు.