పంద్రాగస్టుకు ఖైదీల విడుదల | CM KCR Order For Release Prisoners Of Good Character On August 15th | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు ఖైదీల విడుదల

Published Thu, Jul 23 2020 4:25 AM | Last Updated on Thu, Jul 23 2020 7:53 AM

CM KCR Order For Release Prisoners Of Good Character On August 15th - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హోంశాఖను ఆయన కోరారు. సీఎం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలపై చర్చ జరిగింది. ఆగష్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కసరత్తు గురువారానికి కొలిక్కి వచ్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి సాక్షికి వివరించారు. కోవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ జైళ్లశాఖ దాదాపు 100 మందికి పైగా ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement