అబుదాబిలో.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు! | Telangana Emergence Festival In Abu Dhabi Nri News | Sakshi
Sakshi News home page

అబుదాబిలో.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు!

Published Mon, Jun 3 2024 12:39 PM | Last Updated on Mon, Jun 3 2024 1:06 PM

Telangana Emergence Festival In Abu Dhabi Nri News

తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబుదాబిలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి నగరం లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జామున అబుదాబిలోని BS ఈవెంట్స్ హాల్ ఆవిర్భావ ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమం లో మొదటగా దీప ప్రజ్వలన, గణపతి వందనతో ప్రారంభించారు.

ఆ తరువాత తెలంగాణ సిద్ధాంత కర్త కీర్తి శేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి పటానికి పూల మాల వేసి అసోసియేషన్ కార్య వర్గ సభ్యులందరు జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని చిన్నారులు పాడిన తెలంగాణ ఉద్యమ గీతమైన జయహే జయహే తెలంగాణతో వచ్చిన వారందరిలో ఉద్యమ కాలం నాటి స్మృతులను గుర్తుకు తెస్తూ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్ద్యేశించి మాట్లాడుతూ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదని అది ఒక స్ఫూర్తి అని, దాని మూలాలనూ ముందు తరాలకు చేరవేసే భాద్యత తల్లిదండ్రులదేనని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా శ్రీనివాస రావు తెలియజేశారు. అనంతరం చిన్నారులు చేసిన తెలంగాణ ఆట పాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఆకర్షించాయి.

కార్యక్రమాన్ని చిన్నారుల ద్వారా ఇంత ఆకర్షితంగా చూపించడానికి సహకరించిన చిన్నారుల తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని, ఈ రకంగా ముందు తరాలకు తెలంగాణ చరిత్ర కళలు పంచిన వాళ్ళము అవుతామని ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం యాంకర్ గా వ్యవహరించిన గోపినాథ్ మల్లెల గారు అన్నారు.

ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చిన మల్లేష్ కోరేపు తనదయిన శైలిలో తెలంగాణ పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్బంగా జూన్ 9 నాడు దుబాయిలో స్పార్క్ మీడియా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న దశాబ్ది ఉత్సవాల వేడుకల పోస్టర్ రిలీజ్ చేశారు. కార్య నిర్వాహకులు దశాబ్ది ఉత్సవాల గుర్తుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఎమిరేట్స్ ఎన్ బి డి బ్యాంకు వారు ఇచ్చిన బహుమతుల పంపిణి చేసారని కార్య నిర్వాహక సభ్యుడు అశోక్ గుంటక తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కార్యనిర్వాహక సభ్యులు పావని శ్రీనివాస్, అర్చన వంశీ, పద్మజ గంగారెడ్డి, లతా గోపాల్, దీప్తి శ్రీనివాస్, ప్రియ వెంకట్ రెడ్డి, లక్ష్మిరెడ్డిలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement