
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆరవ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌలాలంపూర్‌లో బ్రిక్ ఫీల్డ్స్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభించి అనంతరం తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి. భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైటా సుభ్యులందరికి ఫ్యామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు. దీనిలో భాగంగా మైటా బ్యాడ్మింటన్ స్మాష్ టోర్నమెంట్‌లను, పిల్లలకు పెద్దలకు పలు ఆటలను ఆడించి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు, టీఆర్‌ఎస్ మలేషియా ప్రెసిడెంట్ చిట్టి బాబు, ముఖ్య కార్య వర్గ సభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్, మారుతీ, చందు, సందీప్, కిరణ్, ప్రతీక్, రవితేజ, సందీప్ నరేందర్, సంతోష్, స్వప్న, అశ్విత, సాహితి సాయిచరని, అనూష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment