మలేషియాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు | Malaysia Andhra Association Organised Sankranti Celebration Grandly | Sakshi
Sakshi News home page

మలేషియాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Published Mon, Jan 16 2023 1:52 PM | Last Updated on Mon, Jan 16 2023 1:58 PM

Malaysia Andhra Association Organised Sankranti Celebration Grandly - Sakshi

మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్వర్యములో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్  హాల్, ఖీఔఓ  కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్  లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా  ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ఇండియన్ హై కమీషనర్ అఫ్ మలేషియా హెచ్‌.ఈ.బీ.ఎన్‌ రెడ్డి, మలేషియా తెలుగు అసోసియేషన్  వైస్ ప్రెసిడెంట్ సీతా రావు  మలేషియా తెలంగాణ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య,  వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి , మలేషియా తెలుగు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఇతర తెలుగు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో  కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు నృత్యాలతో ఆడిటోరియం కళకళలాడింది. అలాగే జబర్దస్త్ ఫేమ్ అశోక్, బాబీ పాల్గొని వారి హాస్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రుచికరమైన తెలుగు వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే ముగ్గులపోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్ , లక్కీ డ్రా నిర్వహించి బంగారు బహుమతులను అందజేశారు. హెచ్‌.ఈ.బీ.ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. విదేశీ గడ్డపై ఇలాంటి పండుగలు నిర్వహిస్తూ తమ సంస్కృతి, సంస్కారాలను కాపాడుతూ నవతరాలకు చాటిచెబుతేన్న మా అసోసియేషన్ ను అయన అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలలో ప్రతి ఇంట ఆనందాలు వెళ్లి విరియాలని అయన  ఆకాంక్షించారు.

మా ప్రెసిడెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా వాటిని  కాపాడుతు రేపటి తరం పిల్లలకు తెలియచేయటం మన బాధ్యత అన్నారు. అలాగే సంక్రాతి పండుగా గొప్పతనాన్ని వివరించారు. ఈ  కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన  శ్రీ బిర్యానీ , టెక్ తీరా , ఎస్‌వీఐ టెక్నాలజీస్ , ఆక్సీ డేటా , రెడ్ వేవ్ , జాస్ ట్రేట్జ్ ,క్లబ్ మహీంద్రా ,మినీ మార్ట్ , మై టెక్ ,కానోపుస్ , లు లు మనీ , ఈగల్ టెక్ ,నిమ్మల, మై 81,ఫామిలీ గార్డెన్,దేశి  తడ్కా,బిగ్ సి హైదరాబాద్,మై బిర్యానీ హౌస్,ప్రబలీస్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీరామ్ కోర్ కమిటీ సభ్యులు వెంకట్,శ్రీనివాస్ చౌటుపల్లి, నల్ల స్వామి నాయుడు ,జగదీష్ శ్రీరామ్ ,కిరణ్ గుత్తుల ,రవి వంశి ,శారద ,దీప్తి ,హరీష్ నడపన ,రామ్ గొల్లపల్లి ,గణేష్ ,కిషోర్ ,నాయుడు రావూరి ,రవి జాస్ ,సందీప్ తన్నీరు ,సతీష్ నంగేడా ,కల్పనా తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement