ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టీఏఎన్‌జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కాన్సుల్ ఆఫ్ ఇండియా భాన్ ధిలాన్ తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, ఇదే భారతదేశ ప్రత్యేకత అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, భాష, యాస, సంస్కృతులకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ వేదిక అని టీఏఎన్‌జెడ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు.
ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీఏఎన్‌జెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాజి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు తమ ఉత్తేజకరమైన రచనలు, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమానికి ఊపిరి పోసారన్నారు.
ఈ కార్యక్రమంలో రూబి దిలాన్, టీఏఎన్‌జెడ్ వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దంతాల, జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి అడవల్లి, ట్రెజరర్ వినోద్ రావు ఎర్రబెల్లి, జాయింట్ సెక్రటరీ విజేతారావు యాచమనేని, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రసన్న కుమార్, లక్ష్మణ్ రెడ్డి కలకుంట్ల, రాంరెడ్డి తాటిపర్తి, శ్రీహరి రావు బండ, లక్ష్మినర్సింహరావు పట్లోరి, జగన్ రెడ్డి వడ్నాల, వెంకట నర్సింహారావు పుప్పాల, నరేందర్ రెడ్డి పట్లోల, రామారావు రాచకొండ, శ్రీనివాస్ పానుగంటి, అరుణ్ ప్రకాశ్ గంగాపురి, సుశాంతి, కృష్ణా రెడ్డి ఆరెపల్లి, రమా సల్వాజి, రాధిక పల్లె, సువర్ణా కాసుగంటి, లక్ష్మీ కాసుగంటి, డా. సరళ, డా. ప్రీతమ్, డా. మోహన్ రెడ్డి బీరపు, మురళీ రంగు, సునీతా కొస్న, విజయ్ కొన్న, అభిలాష్ యాచమనేని, కిరణ్, కీర్తన, వర్ష, గ్రీష్మ, అతిర, రాధిక, అవంతిక శ్రీజలతో పాటూ పెద్దమొత్తంలో ఎన్‌ఆర్‌ఐలు హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment