టాంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఆక్లండ్: న్యూజిలాండ్లోని ఆక్లండ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ వారు ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. అమర వీరులకు జోహార్లు ఆర్పించి, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేసిన ఆనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ వాసులందరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యక్రమంలో విచ్చేసిన వారందరికి టాంజ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
జూన్ 11వ తేదీన సాయంత్రం ఆక్లండ్లోని మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తులో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్లోని తెలంగాణ వాసులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టాంజ్ సభ్యులు కోరారు.
ఆ సమావేశంలో టాంజ్(TANZ) ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, జనరల్ సెక్రటరీ దయానంద్ బచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ ఉమా సిల్వాణి, రాంమోహన్ దంతాల, ట్రెజరర్ జయనంద్ కటకం, ఆడ్వైజరీ కమిటీ మెంబర్స్ వెంటల నర్సింహారావు పుప్పాల, జగన్ మోహన్ వడ్నాల, రామారావు రాచకొండ, శ్రీనివాస్ పానుగంటి, లతో పాటు మోహన్ రెడ్డి బీరం, సరళా బీరం, సనీతా వడ్నాల, వైష్ణవి వడ్నాలతో పాటు టాజ్ అడ్వైజరీ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.