TANZ
-
న్యూజిల్యాండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కాన్సుల్ ఆఫ్ ఇండియా భాన్ ధిలాన్ తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, ఇదే భారతదేశ ప్రత్యేకత అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, భాష, యాస, సంస్కృతులకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ వేదిక అని టీఏఎన్జెడ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీఏఎన్జెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాజి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు తమ ఉత్తేజకరమైన రచనలు, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమానికి ఊపిరి పోసారన్నారు. ఈ కార్యక్రమంలో రూబి దిలాన్, టీఏఎన్జెడ్ వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దంతాల, జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి అడవల్లి, ట్రెజరర్ వినోద్ రావు ఎర్రబెల్లి, జాయింట్ సెక్రటరీ విజేతారావు యాచమనేని, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రసన్న కుమార్, లక్ష్మణ్ రెడ్డి కలకుంట్ల, రాంరెడ్డి తాటిపర్తి, శ్రీహరి రావు బండ, లక్ష్మినర్సింహరావు పట్లోరి, జగన్ రెడ్డి వడ్నాల, వెంకట నర్సింహారావు పుప్పాల, నరేందర్ రెడ్డి పట్లోల, రామారావు రాచకొండ, శ్రీనివాస్ పానుగంటి, అరుణ్ ప్రకాశ్ గంగాపురి, సుశాంతి, కృష్ణా రెడ్డి ఆరెపల్లి, రమా సల్వాజి, రాధిక పల్లె, సువర్ణా కాసుగంటి, లక్ష్మీ కాసుగంటి, డా. సరళ, డా. ప్రీతమ్, డా. మోహన్ రెడ్డి బీరపు, మురళీ రంగు, సునీతా కొస్న, విజయ్ కొన్న, అభిలాష్ యాచమనేని, కిరణ్, కీర్తన, వర్ష, గ్రీష్మ, అతిర, రాధిక, అవంతిక శ్రీజలతో పాటూ పెద్దమొత్తంలో ఎన్ఆర్ఐలు హజరయ్యారు. -
న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(ట్యాంజ్) ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆక్లాండ్‌లోని మౌంట్ రాస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హానరరీ ఇండియన్ హై కమిషన్ అఫ్ న్యూజిలాండ్ భావ్ దిల్లోన్, ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భికూ బాణాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలతోపాటు ఇతర రాష్ట్రాల వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది ప్రాముఖ్యతను ఉమా రామారావు రాచకొండ వివరించగా, ఆచార్య సందీప్ కుమార్ ప్యారాక పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పలు సంస్కృతిక, నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. వండర్ గర్ల్స్, తెలంగాణ హార్ట్ బీట్ గ్రూప్స్ ఆధ్వర్యంలో చేసిన డ్యాన్స్, ఫ్యాషన్ షోలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ఉగాది పచ్చడితో పాటు, తెలంగాణ శాఖాహార విందును ప్రసన్న, గిరిధర్, శ్రీహరి ఏర్పాటు చేశారు. ట్యాంజ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి ఉగాది కరదీపికలు ముద్రించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఉగాది సంబురానికి విచ్చేసిన అతిథులకు పుస్తకాలను అందించడానికి సహకరించిన తెలంగాణ సంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ మామిడికి, టీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కోసినకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు ప్రపంచ మహాసభలు జరపడం, తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చెయ్యడం గొప్ప పరిణామమని తెలిపారు. అలాగే తెలుగును న్యూజిలాండ్‌లో ప్రోత్సహించేందుకు వీలుగా ఇండియన్ అసోసియేషన్ టాగోర్ లైబ్రరీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస సూచికలైన పలు పుస్తకాలను ఉంచబోతున్నట్టు వెల్లడించారు. తెలుగును రెండవ భాష ఆప్షన్‌గా పాఠశాలలో భోధించేలా న్యూజిలాండ్ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ట్యాంజ్ కోర్ అడ్వైజర్ నరేందర్ రెడ్డి పటోళ్ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ట్యాంజ్ కార్యవర్గ సభ్యులు నర్సింగ రావు పట్లొరి, విజేత రావు, రామ రావు రాచకొండ , జగన్ రెడ్డి వాడ్నలా, రామ్మోహన్ దంతాల, రామ్ రెడ్డి తాటిపత్రి, వినోద్ రావు ఎర్రబెల్లి , సురేందర్ రావులు తమ వంతు కృషి చేశారు. -
టాంజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో రాష్ట్ర పండుగైనా బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూజారి చంద్రు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూజిలాండ్ లో ఉండి కూడా బోనాల పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి, ఆచారాలు, భక్తికి నిదర్శనమని అన్నారు. అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి ఉండాలని ఆయన ఆశీర్వదించారు. మహిళలు చాలా భక్తిగా అమ్మవారికి చీరెలు, ఒడి బియ్యం, బోనాలు వివిధ నైవేద్యాలు సమర్పించారు. బాలికలు ఎంతో ఉత్సాహంగ బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి శ్రీనివాస్, పోతురాజు వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాంజ్ ఏర్పాటు చేసిన నోరూరించే తెలంగాణ వంటకాలు, అమ్మవారి నైవేద్యాలతో అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. మైమరిపించే తెలంగాణ బోనాల వాతావరణాన్ని పిల్లపాపలతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. చివరిగా మహిళలు పసుపు కుంకుమలు పంచుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాంజ్ కమిటీ సభ్యులతో పాటు ఆక్లాండ్ లోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆక్లాండ్‌లో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి
ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టాంజ్) కమిటీ సభ్యులు ఆక్లాండ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ జయశంకర్ 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్పూర్తి జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు మరువకూడదని టాంజ్ సభ్యులు పేర్కొన్నారు. అంతేకాకుండా మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల టాంజ్ సంతాపాన్ని తెలిపింది. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సినారె ప్రపంచానికి తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెప్పారని టాంజ్ సభ్యులు పేర్కొన్నారు. సినారె మరణం సినీ రంగానికి, సాహిత్య రంగానికే కాకుండా యావత్ తెలంగాణకు తీరని లోటని తెలిపారు. -
ఆక్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్‌జడ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా న్యూజీలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి పోలా బెనిట్ పాల్గొన్నారు. ఆమె జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారంతా.. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర గీతం, వందేమాతరం, న్యూజీలాండ్ జాతీయగీతాలను ఆలపించారు. టీఏఎన్‌జడ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి మాట్లాడుతూ.. తెలంగాణ వారందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ నృత్యం అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భీకూ బీనా, ఎంపీ కన్వల్జీత్ సింగ్, రాహుల్ సిరిగిరి, బాల వేణుగోపాల్‌రెడ్డి, ఇంద్రి సిరిగిరి, రవీంద్రన్, లింగప్ప, హర్షద్ భాయి, జీత్ సచ్దేవ్, వెంకట్రామన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. టాంజ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
టాంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఆక్లండ్: న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ వారు ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. అమర వీరులకు జోహార్లు ఆర్పించి, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేసిన ఆనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ వాసులందరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యక్రమంలో విచ్చేసిన వారందరికి టాంజ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 11వ తేదీన సాయంత్రం ఆక్లండ్‌లోని మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తులో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్‌లోని తెలంగాణ వాసులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టాంజ్ సభ్యులు కోరారు. ఆ సమావేశంలో టాంజ్(TANZ) ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, జనరల్ సెక్రటరీ దయానంద్ బచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ ఉమా సిల్వాణి, రాంమోహన్ దంతాల, ట్రెజరర్ జయనంద్ కటకం, ఆడ్వైజరీ కమిటీ మెంబర్స్ వెంటల నర్సింహారావు పుప్పాల, జగన్ మోహన్ వడ్నాల, రామారావు రాచకొండ, శ్రీనివాస్ పానుగంటి, లతో పాటు మోహన్ రెడ్డి బీరం, సరళా బీరం, సనీతా వడ్నాల, వైష్ణవి వడ్నాలతో పాటు టాజ్ అడ్వైజరీ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు. -
రక్తదానం వెలకట్టలేనిది: టీఏఎన్‌జడ్
ఆక్లాండ్: తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (TANZ) వారు ఆక్లాండ్‌లో ఈ రోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఏఎన్జెడ్ సభ్యులతో పాటు 150 మంది వరకు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీఏఎన్‌జడ్ సభ్యులు మాట్లాడుతూ వెలకట్టలేని దానం రక్తదానం అన్నారు. ఒక్క మనిషి చేసిన రక్తదానం ముగ్గురి ప్రాణాల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ముందు ముందు నిర్వహించే రక్తదాన కార్యక్రమాల్లో తెలంగాణ వాసులు వీలైనంత మంది తమ సౌలభ్యం చూసుకొని తప్పకుండా పాల్గొనలన్నారు. ఇలాంటి సాంఘిక పరమైన సేవా కార్యక్రమాలను విజయవంతం చేస్తే టీఏఎన్జెడ్కి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, మీనరల్ సెక్రటరీ దయాకర్, వైస్ ప్రెసిడెంట్ రాంమోహన్, ఉమా సల్వాజి, దయానంద్, వెంకట నరసింహారావు, రామారావు, శ్రీనివాస్, జగన్ వడ్నాల రమాదేవి, సునీత, లక్ష్మీ, అరుణ జ్యోతి, విజేత ఇతర సభ్యులు పాల్గన్నారు. -
టాంజ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఆక్లండ్: న్యూజిలాండ్‌లోని ఆక్లండ్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ మత ప్రార్థన, భక్తి గీతాలతో కార్యక్రమం ప్రారంభమైంది. పెద్దలు, చిన్నారులు అలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. టాంజ్ సభ్యులు పాస్టర్‌తో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టాంజ్ సభ్యులతో పాటు పాస్టర్ పాల్, శశిధర గాడ్డల, నవీన్ గుంటుక, మధుకుమార్ ఎర్ర, పెద్ద సంఖ్యలో క్రైస్తవులతో పాటు ఇతరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను విచ్చేసిన అందరికీ టాంజ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఆక్లాండ్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో మంగళవారం ఆక్లాండ్‌లో తెలుగు ప్రజలు వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆక్లాండ్ లోని పాపకూర గణేష్ ఆలయంలో టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కె, కార్యదర్శి దయాకర్ బాచు, ఉపాధ్యక్షుడు రామ్ మోహన్ దంతాల ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో దాదాపు మూడు వేల మంది భక్తులు పాల్గొనడంతో సందడి వాతావారణం కనిపించింది. ఆలయ పూజారి చంద్రు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు టీఏఎన్జెడ్ సభ్యులు మహా ప్రసాదం అందజేశారు. టీఏఎన్జెడ్ అనంతరం నిమజ్జనం వేడుకలో చిన్నాపెద్దా వ్యత్యాసం లేకుండా అందరూ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కె, కార్యదర్శి దయాకర్ బాచు, ఉపాధ్యక్షుడు రామ్ మోహన్ దంతాల, కార్యనిర్వాహక సభ్యులు వి.సునీత, కె.లక్ష్మీ, సౌజన్య బాచు, అరుణ పానుగంటి, ఇతర కీలకసభ్యులు, స్థానిక వాలంటీర్లు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆక్లాండ్‌లో ఘనంగా జయశంకర్ జయంతి
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటం వద్ద దీపం వెలిగించి, ఫొటోకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఏఎన్జెడ్ ఇన్ ఛార్జ్ ప్రెసిడెంట్ శ్రీరాంమోహన్ దంతాల మాట్లాడుతూ... తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ త్రికరణ శుద్ధిగా తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన త్యాగాన్ని కొనియాడారు. ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చారని, మనమంతా కలిసికట్టుగా తెలంగాణ బిడ్డలుగా బంగారు తెలంగాణకై పాటుపడాలని పిలుపునిచ్చారు. టీఏఎన్జెడ్ వైఎస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాడి మాట్లాడుతూ.. నేడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మూలం, తెలంగాణ ప్రజల ఉనికికి కారణం జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఎలాంటి ధనధాన్యాలు, పేరు ప్రతిష్టలు ఆశించకుండా ఉద్యమంలో ముందుండి అందరినీ నడిపించారని చెప్పారు. టీఏఎన్జెడ్ ట్రెజరర్ దయానంద్ కటకం మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నర్సింహారావు పుప్పాల, మన్నెం నవీన్ కుమార్, రమేష్ కలకుంట్ల, శ్రీనివాస్.పి, రామారావు రాచకొండ, రమాదేవి సల్వాజి, శశి, టీఏఎన్జెడ్ కు చెందిన ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
న్యూజీలాండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన న్యూజీలాండ్ ఇండియన్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు భీకు భాను, ప్రకాష్ బీరాదర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కల్యాణ్ రావు కాసుగంటి, ఉపాధ్యక్షుడు ఉమా సల్వాజి, జనరల్ సెక్రటరీ బి.దయాకర్, జాయింట్ సెక్రటరీ యాచమనేని జ్యోతి ప్రజ్వలణలో పాల్గొన్నారు. వీరితో పాటు టీఏఎన్జెడ్ ముఖ్య సభ్యులు, భారతీయ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్, ఆక్లాండ్ మలయాళి సమాజ్, సాయిబాబా సంస్థాన్, న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు, ఇతర ప్రముఖులు కలిసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టీఏఎన్జెడ్ క్యాలెంజర్ ని ఆవిష్కరించారు. మహిళలు బతుకమ్మ ఆడి తెలంగాణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను గణేశుని ప్రార్థనతో ప్రారంభించారు. చిన్నారి గ్రీష్మ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చక్కగా ఆలపించింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడికి విచ్చేసిన అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు శ్రిసుత నాంపల్లి, మురళీధర్ వ్యాక్యాతలుగా వ్యవహరించారు. కల్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ.. టీఏఎన్జెడ్ విజన్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్పాన్సర్స్ కి, ఇతర సభ్యులకు జనరల్ సెక్రటరీ దయాకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సేవలను, సాయుధ పోరాటం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను కొనియాడారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా తెలంగాణపై అభిమానంతో ఇక్కడికి వచ్చారని వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దంతాల అన్నారు. జాతీయ గీతం జనగనమణ ఆలపించి ఈ కార్యక్రమాన్ని ముగించారు.