టాంజ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు | christmas celebrations in new zealand organised by tanz | Sakshi
Sakshi News home page

టాంజ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Published Wed, Dec 21 2016 6:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

టాంజ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

టాంజ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ఆక్లండ్: న్యూజిలాండ్లోని ఆక్లండ్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ మత ప్రార్థన, భక్తి గీతాలతో కార్యక్రమం ప్రారంభమైంది. పెద్దలు, చిన్నారులు అలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

టాంజ్ సభ్యులు పాస్టర్తో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టాంజ్ సభ్యులతో పాటు పాస్టర్ పాల్, శశిధర గాడ్డల, నవీన్ గుంటుక, మధుకుమార్ ఎర్ర, పెద్ద సంఖ్యలో క్రైస్తవులతో పాటు ఇతరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను విచ్చేసిన అందరికీ టాంజ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement