టాంజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు | bonalu festival celebrated in new zealand | Sakshi
Sakshi News home page

టాంజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు

Published Tue, Jul 18 2017 8:36 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

bonalu festival celebrated in new zealand

ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో రాష్ట్ర పండుగైనా బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూజారి చంద్రు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూజిలాండ్ లో ఉండి కూడా  బోనాల పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి, ఆచారాలు, భక్తికి  నిదర్శనమని అన్నారు. అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి ఉండాలని ఆయన ఆశీర్వదించారు.

మహిళలు చాలా భక్తిగా అమ్మవారికి చీరెలు, ఒడి బియ్యం, బోనాలు వివిధ నైవేద్యాలు సమర్పించారు. బాలికలు ఎంతో ఉత్సాహంగ బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి శ్రీనివాస్, పోతురాజు వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాంజ్ ఏర్పాటు చేసిన నోరూరించే తెలంగాణ వంటకాలు, అమ్మవారి నైవేద్యాలతో అందరూ  తృప్తిగా భోజనాలు చేశారు. మైమరిపించే తెలంగాణ బోనాల వాతావరణాన్ని పిల్లపాపలతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. చివరిగా మహిళలు పసుపు కుంకుమలు పంచుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాంజ్ కమిటీ సభ్యులతో పాటు ఆక్లాండ్ లోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement