ఆక్లాండ్లో ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి | TANZ pays tributes to jayashankar | Sakshi

ఆక్లాండ్లో ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి

Published Sun, Jun 25 2017 4:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

ఆక్లాండ్లో ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి

ఆక్లాండ్లో ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టాంజ్) కమిటీ సభ్యులు ఆక్లాండ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ జయశంకర్ 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

ఆక్లాండ్ :
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టాంజ్) కమిటీ సభ్యులు ఆక్లాండ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ జయశంకర్ 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్పూర్తి జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు మరువకూడదని టాంజ్ సభ్యులు పేర్కొన్నారు.   

అంతేకాకుండా మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల టాంజ్ సంతాపాన్ని తెలిపింది. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సినారె ప్రపంచానికి తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెప్పారని టాంజ్ సభ్యులు పేర్కొన్నారు. సినారె మరణం సినీ రంగానికి, సాహిత్య రంగానికే కాకుండా యావత్ తెలంగాణకు తీరని లోటని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement