అనసూయ ‘అరి’కోసం వినూత్న ప్రచారం | Ari Movie Latest Update, Makers Planned Innovative Promotions For This Film - Sakshi
Sakshi News home page

అనసూయ ‘అరి’కోసం వినూత్న ప్రచారం

Published Wed, Jan 10 2024 5:49 PM | Last Updated on Wed, Jan 10 2024 6:45 PM

Ari Movie Latest Update - Sakshi

పేపర్‌ బాయ్‌ ఫేమ్‌ జయశంకర్‌ తెరకెక్కించిన రెండో చిత్రం అరి. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, సాయికుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్, సూర్య పురిమెట్ల, వినోద్‌ వర్మ, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.  ఆర్వీ రెడ్డి సమర్పణలో తిమ్మప్ప నాయుడు, శేషు మారం రెడ్డి, శ్రీనివాస్‌ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుత్తం పోస్ట్‌ ప్రొడక్షన్‌పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల కాబోతుంది.

ఇదిలా ఉండగా..ఈ చిత్రం ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్లాన్‌ చేశారు మేకర్స్‌. కరీంనగర్‌లో ఉన్న స్థానిక సింగర్స్‌లో ఈ సినిమాలోని ‘చిన్నారి కిట్టయ్య’సాంగ్‌ని పాడిస్తూ ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ పాటను ప్రముఖ గాయని మంగ్లీ పాడారు. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించగా.. అనూబ్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement