ఆక్లాండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆక్లాండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published Tue, Jun 13 2017 8:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జడ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా న్యూజీలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి పోలా బెనిట్ పాల్గొన్నారు. ఆమె జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారంతా.. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర గీతం, వందేమాతరం, న్యూజీలాండ్ జాతీయగీతాలను ఆలపించారు. టీఏఎన్జడ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి మాట్లాడుతూ.. తెలంగాణ వారందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ నృత్యం అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భీకూ బీనా, ఎంపీ కన్వల్జీత్ సింగ్, రాహుల్ సిరిగిరి, బాల వేణుగోపాల్రెడ్డి, ఇంద్రి సిరిగిరి, రవీంద్రన్, లింగప్ప, హర్షద్ భాయి, జీత్ సచ్దేవ్, వెంకట్రామన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. టాంజ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement