రక్తదానం వెలకట్టలేనిది: టీఏఎన్‌జడ్‌ | Blood donation program under TANZ | Sakshi
Sakshi News home page

రక్తదానం వెలకట్టలేనిది: టీఏఎన్‌జడ్‌

Published Wed, May 24 2017 11:39 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తదానం వెలకట్టలేనిది: టీఏఎన్‌జడ్‌ - Sakshi

రక్తదానం వెలకట్టలేనిది: టీఏఎన్‌జడ్‌

ఆక్లాండ్‌: తెలంగాణ అసోషియేషన్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌ (TANZ) వారు ఆక్లాండ్‌లో ఈ రోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఏఎన్‌జెడ్‌ సభ్యులతో పాటు 150 మంది వరకు తెలంగాణ వాసులు పాల్గొన్నారు.  టీఏఎన్‌జడ్‌ సభ్యులు మాట్లాడుతూ వెలకట్టలేని దానం రక్తదానం అన్నారు. ఒక్క మనిషి చేసిన రక్తదానం ముగ్గురి ప్రాణాల్ని కాపాడుతుందని పేర్కొన్నారు.

ముందు ముందు నిర్వహించే రక్తదాన కార్యక్రమాల్లో తెలంగాణ వాసులు వీలైనంత మంది తమ సౌలభ్యం చూసుకొని తప్పకుండా పాల్గొనలన్నారు.  ఇలాంటి సాంఘిక పరమైన సేవా కార్యక్రమాలను విజయవంతం చేస్తే టీఏఎన్‌జెడ్‌కి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ కల్యాణ్‌ కాసుగంటి, మీనరల్‌ సెక్రటరీ దయాకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ రాంమోహన్‌, ఉమా సల్వాజి, దయానంద్‌, వెంకట నరసింహారావు, రామారావు, శ్రీనివాస్‌, జగన్‌ వడ్నాల రమాదేవి, సునీత, లక్ష్మీ, అరుణ జ్యోతి, విజేత ఇతర సభ్యులు పాల్గన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement