ఆక్లాండ్లో ఘనంగా వినాయక నిమజ్జనం | Telangana Association of New Zealand celebrates Ganesh Immersion | Sakshi
Sakshi News home page

ఆక్లాండ్లో ఘనంగా వినాయక నిమజ్జనం

Published Wed, Sep 14 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

ఆక్లాండ్లో ఘనంగా వినాయక నిమజ్జనం

ఆక్లాండ్లో ఘనంగా వినాయక నిమజ్జనం

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో మంగళవారం ఆక్లాండ్లో తెలుగు ప్రజలు వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆక్లాండ్ లోని పాపకూర గణేష్ ఆలయంలో టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కె, కార్యదర్శి దయాకర్ బాచు, ఉపాధ్యక్షుడు రామ్ మోహన్ దంతాల ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో దాదాపు మూడు వేల మంది భక్తులు పాల్గొనడంతో సందడి వాతావారణం కనిపించింది. ఆలయ పూజారి చంద్రు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు.

ఆలయానికి వచ్చిన భక్తులకు టీఏఎన్జెడ్ సభ్యులు మహా ప్రసాదం అందజేశారు. టీఏఎన్జెడ్ అనంతరం నిమజ్జనం వేడుకలో చిన్నాపెద్దా వ్యత్యాసం లేకుండా అందరూ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కె, కార్యదర్శి దయాకర్ బాచు, ఉపాధ్యక్షుడు రామ్ మోహన్ దంతాల, కార్యనిర్వాహక సభ్యులు వి.సునీత, కె.లక్ష్మీ, సౌజన్య బాచు, అరుణ పానుగంటి, ఇతర కీలకసభ్యులు, స్థానిక వాలంటీర్లు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement