కెనడాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మిస్సిస్సౌగ :
తెలంగాణ కెనడా సంఘం(టీసీఏ)ఆధ్వర్యంలో మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్ సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలని ఘనంగా జరిగాయి. ఈ సంబురాల్లో దాదాపు500లకు పైగా కెనడాలోని తెలంగాణ వాసులు పాల్గొన్నారు.
అతిథులను కార్యదర్శి రాధిక బెజ్జంకి సాదరంగా ఆహ్వానించగా, అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి సభ ప్రారంభానికి జెండా ఊపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సభకువిచ్చేసిన వారందరు అమరవీరులను స్మరిస్తూ కొద్ది సేపు మౌనం పాటించారు. తర్వాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షులు శ్రీధర్ బండారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడాలోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కెనడా తెలంగాణ జాగృతికి ప్రథమ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రమేశ్ మునుకుంట్ల, ఆయన భార్య ధనలక్ష్మి మునుకుంట్లను కమీటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో సాగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 6 గంటలపాటుసభికులను అలరించాయి. పోతరాజు వేషం, లష్కర్ బోనాల ఊరేగింపు, పీరీల ప్రదర్శన సభికులందర్ని విశేషంగా ఆకర్శించాయి. సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి ఆధ్వర్యంలో ట్రస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, సెక్రటరీ రాధిక బెజ్జంకి, కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ సంతోష్ గజవాడ, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్డి మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, మల్లికార్జున్ మదపు, ట్రస్టీలు సమ్మయ్య వాసం, శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, నవీన్ రెడ్ది సూదిరెడ్ది, హరి రావుల, అఖిలేశ్ బెజ్జంకి, వేణురోకండ్ల, ఇతర వాలంటీర్సు సహకారంతో ఈ వేడుకలను విజవంతంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద, మేఘ స్వర్గంలు వ్యవహరించారు.