Telangana Canada Association
-
కెనడా, టొరంటోలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు
-
కెనడాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
టొరొంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో కెనడాలో గ్రేటర్ టోరొంటోలోని పోర్టుక్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో సంక్రాతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ, తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాల్లో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో ఈ పండుగ సంబురాలు జరిగాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీనివాసు తిరునగరి, ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు హరి రావుల్, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శి శ్రీనివాస్ మన్నెం, కోశాధికారి దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్శి దీప గజవాడ, డైరెక్టర్లు మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరాల, ట్రస్టీలు సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరణ్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల, ఫౌండర్లు కోటేశ్వరరావు చిత్తలూరి, చంద్ర స్వర్గం, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రాజేశ్వర్ ఈద, అథీక్ పాషా, ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, సంతోష్ గజవాడ, నవీన్ సూదిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి చిట్యాలలు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలలో పిల్లలకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. తెలంగాణ కెనడా సంఘం నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి అనుపమ పబ్బ గెలుచుకున్నారు. సాంస్కృతిక కార్యదర్శి దీప గజవాడ, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా సభా సమయం మొత్తానికి కుమారి మేఘ స్వర్గం, హారికలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు అతిథులతో కలిసి టోరొంటో సమయముతో అసోషియేషన్ 2019 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల వందన సమర్పణతో సంక్రాంతి ఉత్సవాలు ముగిశాయి. -
టొరంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
టొరంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగాయి. 2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా దీప గజవాడ, కోషాధికారిగా దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా హరి రావుల్, ట్రస్టీలుగా సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరన్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్షి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్షి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, భారతి కైరొజు, మురళి కాందివనం, ట్రుస్టీ సభ్యులు శ్రీనివాసు తిరునగరి, సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, హరి రావుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. -
కెనడాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మిస్సిస్సౌగ : తెలంగాణ కెనడా సంఘం(టీసీఏ)ఆధ్వర్యంలో మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్ సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలని ఘనంగా జరిగాయి. ఈ సంబురాల్లో దాదాపు500లకు పైగా కెనడాలోని తెలంగాణ వాసులు పాల్గొన్నారు. అతిథులను కార్యదర్శి రాధిక బెజ్జంకి సాదరంగా ఆహ్వానించగా, అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి సభ ప్రారంభానికి జెండా ఊపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సభకువిచ్చేసిన వారందరు అమరవీరులను స్మరిస్తూ కొద్ది సేపు మౌనం పాటించారు. తర్వాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షులు శ్రీధర్ బండారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడాలోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కెనడా తెలంగాణ జాగృతికి ప్రథమ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రమేశ్ మునుకుంట్ల, ఆయన భార్య ధనలక్ష్మి మునుకుంట్లను కమీటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో సాగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 6 గంటలపాటుసభికులను అలరించాయి. పోతరాజు వేషం, లష్కర్ బోనాల ఊరేగింపు, పీరీల ప్రదర్శన సభికులందర్ని విశేషంగా ఆకర్శించాయి. సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి ఆధ్వర్యంలో ట్రస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, సెక్రటరీ రాధిక బెజ్జంకి, కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ సంతోష్ గజవాడ, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్డి మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, మల్లికార్జున్ మదపు, ట్రస్టీలు సమ్మయ్య వాసం, శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, నవీన్ రెడ్ది సూదిరెడ్ది, హరి రావుల, అఖిలేశ్ బెజ్జంకి, వేణురోకండ్ల, ఇతర వాలంటీర్సు సహకారంతో ఈ వేడుకలను విజవంతంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద, మేఘ స్వర్గంలు వ్యవహరించారు.